new districts

New Districts – Conducting Transfers – Poll

New Districts – Conducting Transfers – జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న ఈ సమయంలో బదిలీలు నిర్వహించడం అర్థవంతంగా ఉంటుందా ?.

కొత్త జిల్లాల పై కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేయాలని భావిస్తోంది. దీని ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న బదిలీలపై ఉంటుందా?, ఉంటే ఏ విధంగా ఉంటుంది ?, కొత్త జిల్లాల కంటే ముందుగా బదిలీ జరిగితే దాని ప్రభావం ఏమిటి ?, కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత జరిగితే దాని ప్రభావం ఏమిటి ? అని కొంతమంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

మీ ఓటు ఇక్కడ వేయండి

Coming Soon
జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న ఈ సమయంలో బదిలీలు నిర్వహించడం అర్థవంతంగా ఉంటుందా ?
జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న ఈ సమయంలో బదిలీలు నిర్వహించడం అర్థవంతంగా ఉంటుందా ?
జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న ఈ సమయంలో బదిలీలు నిర్వహించడం అర్థవంతంగా ఉంటుందా ?

కొత్త జిల్లాలు – బదిలీలపై ప్రభావం

  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చాలని అభిప్రాయంలో ఉంది. దీనికోసం ఇప్పటికే ఒక కమిటీని నియమించాలని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
  • ప్రస్తుతం ప్రతి జిల్లా పార్లమెంటు ప్రాతిపదికగా కాకుండా పూర్వం లో ఉన్న వెసులుబాటును బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీటి స్వరూపం మారిపోతుంది.
  • దీనివలన జిల్లా యూనిట్ గా జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తుల పై ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం ఎవరికి వారు వారి వెసులుబాటును బట్టి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. అంతేకాకుండా వారు నివాసం ఉంటున్న ప్రాంతానికి దగ్గరలో కాకుండా జిల్లాలోని దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.
  • ప్రస్తుతం జరపబోయే బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నందున తప్పనిసరి బదిలీ పొందేవారు జిల్లాలోని ఏదో ఒక ప్రాంతానికి బదిలీ అవుతారు. ఇలా కేటాయించే పాఠశాల ప్రస్తుత జిల్లా యూనిట్ గా జరుగుతుంది.
  • ఇప్పుడు బదిలీ పొందేవారు భవిష్యత్తులో ప్రకటించే టటువంటి నూతన జిల్లాల ప్రకటన ద్వారా ప్రస్తుతం ఉంటున్న జిల్లా నుంచి వేరొక జిల్లాగా మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ నివాస ప్రాంతం మరొక జిల్లాలో ఉంటుంది. దీనివలన తమ నివాస ప్రాంతం కాకుండా వేరొక జిల్లాలో పని చేయాల్సి వస్తుంది.
  • కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసిన తరువాత ఉద్యోగులకు తన సొంత జిల్లాలకు వెళ్ళడానికి ప్రభుత్వం ఆప్షన్ ఇస్తుంది. ఇది కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతుంది. దీనిపై ఉద్యోగ వర్గంలో చాలా సందేహాలు ఉన్నాయి.
Also Read:  Supplier Contacts - Centralized Material to Nadu Nedu Schools

తెలంగాణలో అనుసరించిన విధానం

  • మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను చాలా కాలం క్రితం ఏర్పాటు చేశారు.
  • దీనిపై అక్కడ ఉన్న ఉపాధ్యాయ మిత్రులకు సమాచారం కోసం సంప్రదించగా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఏ జిల్లా కావాలో ఎంచుకునే అవకాశం ఇచ్చినప్పటికీ అది అది కార్యరూపం దాల్చలేదని తెలియజేశారు. ఇప్పటికీ తమ నివాస ప్రాంతం తాము పనిచేస్తున్న ప్రాంతం మరొక జిల్లా అని తెలిపారు.
  • అత్యవసర సమయాల్లో పాత జిల్లా కేంద్రంగానే బదిలీలు ప్రమోషన్లు ఇతర సర్వీస్ వ్యవహారాలు జరుగుతున్నట్లుగా తెలిపారు.
  • అక్కడ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి చాలా కాలం అయినప్పటికీ ఇంకా అధికారిక కేంద్ర కార్యకలాపాల్లో మార్పులు చోటు చేసుకోలేదని తెలిపారు.

ముగింపు

  • ఇప్పుడు బదిలీ పొంది అనువైన పాఠశాల పొందినప్పటికీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల మళ్లీ స్థానచలనం తప్పదేమో అన్న భావన వ్యక్తమవుతోంది.

 

10 COMMENTS

  1. After districts byfirication transfers should be conducted. And now so many teachers are in naadu nedu works in schools .

  2. It is rediculous conducting transfers before the bifurcation of districts. Problems may arise if the transfers are conducted. A specific strategy should be followed to avoid such problems

  3. During this situation transfers are not correct before the formation of new districts. Better to conduct after that.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here