rc.155

RC.155 in Telugu – Admissions Instructions

Rc.155 in Telugu – పాఠశాల విద్యా శాఖ వారు 2020-21 విద్యాసంవత్సరం కు సంబంధించి పాఠశాలల్లో  ప్రవేశం కొరకు అనుసరించాల్సిన పద్ధతిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.

రీజనల్ జాయింట్ డైరెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచనలు

రాష్ట్రంలోని అధికారులందరూ ఈ మెమో లో సూచించిన ఆదేశాలు అమలయ్యేలా వారి పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలి.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆదేశాలు

అడ్మిషన్లు ప్రారంభం

  • రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అన్ని తరగతులకు 2020- 21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను తక్షణమే ప్రారంభించాలి. కరోనా వైరస్ అంటకుండా డా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  • దీని కోసం ఏ విద్యార్థిని పాఠశాలకు పిలవకూడదు

ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది పాటించాల్సిన సూచనలు

  • అన్ని ప్రాథమిక పాఠశాల లోని 1 నుండి 4 తరగతులు, ప్రాథమిక ఉన్నత పాఠశాల లోని 1 నుండి 6 తరగతులు, ఉన్నత పాఠశాల లోని 6 నుండి 9 తరగతుల విద్యార్థులు తదుపరి తరగతికి ప్రమోట్ చేసినందున దానికి సంబంధించిన రిజిస్టర్ లో సిద్ధం చేసుకోవాలి.
  • ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి నుండి ప్రమోట్ అయిన విద్యార్థులు, ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి నుండి ప్రమోట్ అయిన విద్యార్థులు వారు చేరాలనుకున్న పాఠశాలను నిర్ణయం చేసుకున్నాక సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని వ్యక్తిగతంగా కలిసి ప్రవేశం కోసం అభ్యర్థించాలి. ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారి, ఉన్నత పాఠశాలలకు సంబంధించి సంబంధిత ఉప విద్యాశాఖాధికారి ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తారు. ఏ విద్యార్థిని కూడా వారి యొక్క తల్లిదండ్రులను సంప్రదించకుండా మరియు వారి దగ్గర నుండి పాఠశాలలో చేరుతున్నట్టు ఏ విధమైన ఆధారం లేకుండా పాఠశాలలో చేర్చకూడదు.
  • విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుండి స్పష్టమైన లిఖిత పూర్వకమైన ఎంపిక తీసుకున్నాక ఉపాధ్యాయులు పూర్వపు పాఠశాల నుండి ఆ విద్యార్థి యొక్క రికార్డ్ షీట్ లేదా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ను తీసుకోవాలి.
  • రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ మరియు కస్తూర్బా బాలికా విద్యాలయాలు సంబంధించిన ప్రవేశాలు ఆన్లైన్లో జరుగుతాయి. కావున ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సంబంధించిన పత్రాలను సరైన రసీదు తీసుకుని విద్యార్థులకు అందించాలి.
Also Read:  MHRD Secretary Letter to All States Chief Secretaries

బడి బయటి పిల్లలు గుర్తింపు

  • పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం బడిబయట ఉన్న పిల్లలను గుర్తించాలి.
  • వలస కూలీల పిల్లలను ఏ విధమైన ధ్రువపత్రం లేకుండా, కేవలం వారి యొక్క గుర్తింపు కార్డును ఆధారంగా చేసుకుని ప్రవేశం కల్పించాలి. వారి నుండి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లేదా పూర్వపు పాఠశాలకు సంబంధించిన ఆధారాలేవీ అడగకూడదు. వారి తల్లిదండ్రులు అందించిన సమాచారం మేరకు వారిని దగ్గరలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గ్రాంటు పొందే పాఠశాలలో ప్రవేశం కల్పించాలి.

ఆదేశాల అమలు తేదీ

ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలి. ఉత్తర్వులను ఈ లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here