Medical Reimbursement Extension

Medical Reimbursement Extension – G.O.321 Issued

Medical Reimbursement Extension – ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 31, 2020 వరకు పొడిగించింది.

What is Medical Reimbursement ?

ప్రభుత్వ ఉద్యోగులు తమ వైద్య అవసరాల నిమిత్తం మరియు తన కుటుంబ సభ్యుల వైద్య అవసరాల నిమిత్తం చేసిన ఆసుపత్రి ఖర్చులను ప్రభుత్వం తిరిగి ఉద్యోగులకు చెల్లించే విధానమే మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం.

Why Medical Reimbursement Extended ?

ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీం ప్రవేశపెట్టినప్పటి నుండి ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేసి ఉచితంగా వైద్యం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ ఈ పథకం ఉద్యోగులు ఆశించిన విధంగా ఫలితాలు లేకుండా లోపభూయిష్టంగా ఉన్నందున ఉద్యోగులందరూ మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని పొడిగించాలని అభ్యర్థిస్తూ ఉన్నారు. ఇలా ఉద్యోగుల అభ్యర్థనలను పరిగణించిన ప్రభుత్వం మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఇది మూడవ సారి.

MR Extension Details

గతంలో కూడా ఇదేవిధంగా జిఓ నెంబర్ 345, జీవో నెంబర్ 482 ద్వారా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని డిసెంబర్ 31, 2019 వరకు పొడిగిస్తూ వచ్చారు. అదేవిధంగా ఈసారి కూడా జీవో నెంబర్ 321 ద్వారా ఈ పథకాన్ని జనవరి 1, 2020 నుండి జూలై 31, 2020 వరకు పొడిగించారు.

Use of MR Extension

ఈ విధంగా మెడికల్ రీయింబర్స్ మెంట్ పథకాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వలన, దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం వలన జీవో లో పేర్కొన్న విధంగా జులై 31 2020 లోపు వైద్యం చేయించుకున్న వారు వారు చేసిన ఆసుపత్రి ఖర్చులను తిరిగి పొందవచ్చు.

Requested Associations for Extension

మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని పొడిగించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ వారు తమ వినతి పత్రాలను ప్రభుత్వానికి అందజేసిన కారణంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:  Inclusion of COVID-19 Cases under Dr.YSR Aarogyasri Scheme

Can We Use Employee Health Scheme ?

ప్రభుత్వ ఉద్యోగులు లు ఈ జీవో కల్పించిన సౌకర్యం ద్వారా వారు మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని గాని లేదా ఎంప్లాయ్ హెల్త్ స్కీం కానీ ఏదో ఒక దానిని ఉద్యోగులు ఉపయోగించుకోవచ్చు.

Download

G.O.321, Dated: 16.07.2020 – Available Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here