ఆగస్టులోనే ఉపాధ్యాయ బదిలీలు

ఆగస్టులోనే ఉపాధ్యాయ బదిలీలు – పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు

శ్రీకాకుళం

ఉపాధ్యాయుల బదిలీలు ఆగస్టు చివరివారంలోగా పూర్తి చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. దీనిపై విధివిధానాలు ఖరారు చేసి షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. నాడు-నేడు పనులు సెప్టెంబర్ 5న పాఠశాలలు తెరిచేలోగా ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేలా నియమ నిబంధనలను రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అవసరమైతే కొత్త సర్వీసు నిబంధనలు

రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ విషయంలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, అది కుదరని పక్షంలో కొత్త నిబంధనలను రూపొందిస్తామని కమిషనర్ చెప్పారు. ఉమ్మడి సర్వీసు రూల్సు విషయంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులతో సమావేశమై ఇరుపక్షాలు రాజీ ధోరణి అవలంబించి ఒక ఒప్పందానికి రావాలని సూచించామన్నారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలలకు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తే పోస్టుల మంజూరుతో సహా చేస్తామని పేర్కొన్నారు. వీటిని పదోన్నతుల ద్వారా, నేరుగా భర్తీలా, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలా అన్నదానిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

Also Read:  Enrollment Details - Useful For Upcoming Transfers 2020

1 COMMENT

  1. We are doing our duty still in too remote place since
    Appointment. Any network not available here I.e. Andhra& Karnataka border. Sir we need Transfers compulsory. Otherwise maybe entire of our Service will be completed.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here