జాతీయ విద్యా విధానం – 2020 (వివరణ: ఏ పి టి ఎఫ్ – మిగిలిన ఏ వ్యక్తి, లేదా సంఘం వారు ఇచ్చిన వివరణలు అయినా ఈ వెబ్సైట్ లో చేర్చబడును.)
పాఠశాల విద్యలో మౌలిక మార్పులు తీసుకువచ్చారు 6-14 సంవత్సరాల వయససు వారికి నిర్బన్ద ప్రాథమిక విద్య అని విద్యాహక్కుచట్టంలో పేర్కొంని ఉండగా, 3-18 సంవత్సరాల వయసు వరకు ప్రాథమిక విద్యను అందిస్తామన్నారు. దానికి అనుగుణంగా విద్యా హక్కు చట్టాన్ని సవరించవలసి ఉంటుంది.
పూర్వ ప్రాథమిక విద్యను పాఠశాల విద్యలో భాగం చేశారు. కాని అంగన్‌వాడీల ద్వారా కొనసాగించ
- — పునాది విద్య -5 సం॥లు పూర్వ ప్రాథమిక విద్య ౩ సం॥లు + 1, 2 గ్రేడ్‌లు ౩- 8 సం[ల వయసు వారికి
- ప్రిపరేటరీ స్టేజ్ మూడు సంవత్సరాలు 3, 4, 5 గ్రేడ్లు 8 నుండి 11 సంవత్సరాల వయసు వారికి
- మిడిల్ స్టేజ్ మూడు సంవత్సరాలు 6 ,7, 8 గ్రేడ్లు 11 నుండి14 సంవత్సరాల వయసు వారికి
- సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ నాలుగు సంవత్సరాలు 9, 10, 11, 12 గ్రేడ్లు 14 -18 సంవత్సరాల వయసు వారికి
పౌండేషన్ స్టేజి మరియు ప్రిపరేటరీ దశలో 5వ తరగతి వరకు అక్షరాస్యత, వ్రాథమిక గణితం పైనే దృష్టి కేంద్రీకరిస్తారు. పూర్వ ప్రాథమిక విద్య మరియు 12 గ్రేడ్డ వరకు పాఠ్య పుస్తకాలు ఉండవు
పేద విద్యార్థులను క్రింద స్థాయిలోనే విద్య నుండి దూరం చేసే పథకంలో భాగంగా వృత్తి విద్యను ప్రవేశపెట్టి పదేసిరోజుల పాటు సెలవులు ఇచ్చారు. వృత్తి విద్య (వడ్రంగి, కమ్మరి, కుండలు చేయడం, నేతపని మొదలగునవి అభ్యసించాలని వేసవి సెలవులు, ఇంకా ఇతర సెలవులలో వాటిని కొనసాగించాలని పేర్కొన్నారు. సంపన్నవర్హాల బిడ్డలు ఈ పనులు చేయకుండా ఉన్నత విద్యకు వెళ్లిపోతారు.
కరిక్యులంను, సిలబస్‌ను ఎన్సీఈఆర్టీ ఏ రూపొందిస్తుంది. పాఠ్యపుస్తకాలన్నింటినీ కేంద్రమే తయారుచేసి రాష్ట్రాలకు పంపిస్తుంది. రాష్ట్రాలు స్థానిక అంశాలను జోడించి పాఠ్య పుస్తకాలను ముద్రించుకోవాలి.
ఒకటవ తరగతి నుండి పాఠ్యపుస్తకాల రూపకల్పన కూడా కేంద్రమే చేయడం అధికారాలను కేంద్రీకృతం చేసుకోవడంమే. రాష్ట్రాల హక్కు లను హరించడమే అవుతుంది.