మొబైల్ నెంబర్ మార్చే ఈ ప్రక్రియ అంతా మీ మీ డి డి ఓ చేయాల్సి ఉంటుంది.
STEP-1
ముందుగా ట్రెజరీ డిపార్ట్మెంట్ యొక్క వెబ్ సైట్ లోకి వెళ్లాలి. జిల్లాలను బట్టి లాగిన్ లింకులు మారుతాయి కాబట్టి మీ జిల్లాకు సంబంధించిన లింక్ లోకి లాగిన్ అవ్వండి.
ఉదాహరణకు ప.గో జిల్లా వారు ఈ లింక్ లోకి లాగిన్ అవ్వాలి https://treasury1.apcfss.in/ddoreq/index.php
STEP-2
పే బిల్ ట్రీ మెనూ ఓపెన్ చేయాలి. దీనిలో ఎంప్లాయి రిలీవింగ్ అండ్ జాయినింగ్ అప్డేషన్ మీద క్లిక్ చేయాలి చేయాలి.
STEP-3
కుడివైపు చూపించే బాక్స్లో మొదటి ఆప్షన్ గా మొబైల్ నెంబర్ అప్డేట్ అని దాని ఎదురుగా క్లిక్ హియర్ అనే బాక్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి.
[post_ads]
STEP-4
మరొక పేజీ ఓపెన్ ఎంప్లాయ్ ఐడి అడుగుతుంది. ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఎంప్లాయ్ ఐడి స్థానంలో ఫోన్ నెంబర్ మార్చాలనుకుంటున్న ఉద్యోగి యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ స్థానంలో కొత్తగా ఇవ్వాలనుకుంటున్న ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
STEP-5
ఎలా చేసిన తర్వాత బయోమెట్రిక్ డివైస్ ను సెలెక్ట్ చేసుకుని మీ డి డి ఓ బయోమెట్రిక్ వేయడం ద్వారా మీ మొబైల్ నెంబర్ మారిపోతుంది.