అక్టోబర్ 1 నుంచి వాహనాలకు సంబంధించిన నిబంధనలల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డ్స్(ఆర్‌సీలు), డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి పలు మార్పులను చేసింది.
అక్టోబర్ 1 నుంచి వాహనాలకు సంబంధించిన నిబంధనలల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డ్స్(ఆర్‌సీలు), డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి పలు మార్పులను చేసింది. ఈ నేపథ్యంలో మీరు డ్రైవింగ్ లైసెన్సులను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ వాహనానికి ఆర్సీ బుక్ ఉన్నప్పటికీ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్స్ లో ఉన్నప్పటికీ అప్డేట్ చేస్తూ ఉండాలి.అక్టోబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా యూనిఫాం వెహికిల్స్ రిజిస్ట్రేషన్ కార్డ్స్(ఆర్‌సీలు), డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయబడతాయి. కొత్తగా జారీ చేయబడి డ్రైవింగ్ లైసెన్సులు మైక్రోచిప్ కలిగి ఉంటాయి. క్యూఆర్ కోడ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ విధంగా సెంట్రలైజ్ చేసిన డేటా పదేళ్ల వరకు గవర్నమెంట్ వద్ద ఉంటుంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తులకు ఫైన్లు వేయడం, రికార్డులను నిర్వహించడం ప్రభుత్వానికి ఈజీ అవుతుంది. ఇక ఆర్సీల విషయానికొస్తే.. అక్టోబర్ 1 నుంచి ఈ ప్రక్రియను పేపర్ ఉపయోగించకుండా చేయాలని నిర్ణయించుకుంది. కొత్త ఆర్సీకి ఓనర్ పేరు ముందు భాగంలో ఉంటుంది. వెనుకభాగంలో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్ ఉంటాయి.అంతేగాక, అక్టోబర్ 1 నుంచి పెట్రోల్ పంపుల వద్ద క్రెడిట్ కార్డ్ పేమెంట్ ద్వారా లభించే డిస్కౌంట్లు ఇక ఉండవు. డిజిటల్ పేమెంట్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు చమురురంగ కంపెనీలు క్రెడిట్/డెబిట్ కార్డ్స్, ఈ-వ్యాలెట్స్ పైన ఇప్పటివరకు డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి నో డిస్కౌంట్స్.