అనంతపురం కలెక్టర్ వినూత్న కార్యక్రమం
అక్టోబర్ 11 న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ‘బాలికే భవిష్యత్తు’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యం తో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన బాలికలకు అపురూపమైన అవకాశం కల్పించిన కలెక్టర్
అక్టోబర్ 11 వ తేదీన ప్రతి కార్యాలయంలో ఒక రోజు కార్యాలయపు అధికారిగా బాలికకు పదవీ అవకాశం
కార్యాలయపు అధికారిగా ఆ శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో ఏదైనా అమలు చేయాలనుకుంటే నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కల్పించిన కలెక్టర్
కార్యాలయపు అధికారిగా బాలిక తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్
రేపు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు..ఇలా అన్ని స్థాయిల్లోనూ కార్యాలయపు అధికారులుగా ఒక్క రోజు పదవీ బాధ్యతలు స్వీకరించనున్న బాలికలు
శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఒకరోజు బాలికా అధికారులు పదవుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.