- రేపు ప్రవేశ పరీక్ష
న్యూస్ టోన్, అమరావతి: ఏపీ, తెలంగాణలో శనివారం జరగనున్న రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని కన్వీనరు హరినారాయణ స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షకు 88,972 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరిలో ఏపీకి చెందినవారు 86,617 మంది ఉన్నారని తెలిపారు. 53 మంది అంధ విద్యార్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. ఏపీలో 630, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 4వేల సీట్లు, ఎన్జీ రంగా వ్యవసాయ, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ, వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో డిప్లామా కోర్సులకు 6 వేల సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.