అమరావతి, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయుల బదిలీలలో సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని వైఎ స్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు కె. జాలి రెడ్డి, జి. సుధీర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఫెడరేషన్ సబ్ కమిటీ సమావేశం జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఫెడరే షన్ రాష్ట్ర శాఖలో వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల విజ్ఞప్తుల మేరకు కొందరిని తీసుకున్నట్లు తెలిపారు తూర్పు గోదావరి జిల్లా నుంచి కె జయరాజ్ ను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీజే కెనడిని రాష్ట్ర ఉపాధ్య క్షులుగా, అదే జిల్లాకు చెందిన తోట శామ్యూల్‌ను రాష్ట్ర కార్యదర్శిగా, కడప జిల్లాకు చెందిన పి.వెంకట రెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా, విజయ నగరం జిల్లా నుంచి రంభ రజనీ కాంతను రాష్ట్ర కార్యదర్శిగా, అదే జిల్లాకు చెందిన ఆర్. శ్రీనివాసరావును రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, గుంటూరు జిల్లా నుంచి ఎం. శ్రీనివాసరావును రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు వివరించారు.