- ప్రభుత్వోద్యోగులకు పెన్షనర్లకు తీపికబురు
- జీతాలు, పెన్షన్, డీఏ బకాయిలచెల్లింపు
- కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం
అమరావతి, న్యూస్ టోన్: ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లకు కరవు బత్యం (డీఏ) పెంపుపై మంత్రిమం డలి ఆమోదముద్ర వేసింది, శుక్రవారం ముఖ్యమం త్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దశలవారీ చెల్లింపుపై చర్చించిన అనంరం షెడ్యూల్ ప్రకటించారు, 2018 జూలై నుంచి నిలిచిపోయిన డీఏ చెల్లించాలని నిర్ణయించారు. మొత్తం 80 నెలలకు రూ. 3017.4 కోట్లు కాగా ఉద్యోగులకు రూ.2వేల 136.9 కోట్లు పెన్షనర్లకు రూ.880.5 కోట్లు 3.144 శాతం పెంపుతో చెల్లించేందుకు మంత్రిమండలి సుముఖత వ్యక్తం చేసింది. ఇవికాక ఏడాదికి రూ.858.47 కోట్లు ఉద్యోగులకు, 1208.96 లక్షలు పెన్షనర్లకు చెల్లిస్తారు. వీటిని వచ్చే ఏడాది జనవరి 21 నుంచి జీతాలతో కలిపి చెల్లించాలని నిర్ణయించారు. కాగా రెండోవిడత డీఏ (2019 జనవరి) 30 నెలల కాలపరిమితితో 3017.4 కోట్లు చెల్లింపులు జరుగుతాయి. మూడవ విడత (2019 జూలై) డీఏ బకాయిని 5.24 శాతం పెంచుతూ రూ, 5028.90 కోట్లు చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏడాదికి ఉద్యోగులకు 1424.84 కోట్లు, పెన్షనర్లకు రూ.589.92 కోట్లు వెరసి 2011.56 కోట్లు ప్రతినెలా చెల్లించాలని నిర్ణయించారు. ఇదికాక కరోనా లాక్ డౌన్ సమయంలో ఆలిండియా సర్వీసెస్ అధికారులకు 80 శాతం, ప్రజాప్రతినిధులకు నూరుశాతం, ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 10 శాతం మార్చి, ఏప్రిల్ నెలజీతాల్లో విధించిన కోతను కూడా చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఉద్యోగులకు రూ. 2824 కోట్లు, పెన్షనర్లకు రూ. 422 కోట్లు వచ్చే నెల జీతంతో పాటు జనవరి 2021 జీతాలు, పెన్షన్లతో కలిపి చెల్లించేందుకు సమావేశం సుముఖత వ్యక్తం చేసింది. ఉద్యోగుల భద్రతలో భాగంగా ఆశా వర్కర్లకు వేతనాల పెంపు, 50వేల ఆర్టీసి కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయటం తో పాటు అంగన్‌వాడీ,హోం గార్డులకు వేతనాల పెంపు, అదనంగా 1.4లక్షల ఉద్యోగాల భర్తీ, ఆప్కాస్ ఏర్పాటుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెసులు బాటు కల్పించిన అంశాలు మంత్రి వర్గంలో ప్రస్తావనకు వచ్చాయి.