- డీఎస్సీ-2008 అభ్యర్థుల డిమాండ్
- విజయవాడలో ‘జగనన్న మీద అలక’ రిలే నిరాహార దీక్షలు
అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ-2008కు విల్లింగ్ ఇచ్చిన 2193 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని ఏపీ బీఈడీ విద్యార్థుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెలుగు జ్యోతి డిమాండ్ చేశారు. డీఎస్సీ 2008 అభ్యర్థులు శనివారం ‘చలో విజయవాడ’ నిర్వహించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో ‘జగనన్న మీద అలక’ పేరుతో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వెలుగు జ్యోతి మాట్లాడుతూ.. విల్లింగ్ లేఖలు తీసుకుని ఎనిమిది నెలలు గడుస్తున్నా నియామక పత్రాలు ఇవ్వలేదన్నారు. అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ, న్యాయశాఖ, సంబంధిత అనుబంధ శాఖలన్నీ ఆమోదం తెలిపినప్పటికీ నియామ కపత్రాలను అందజేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మద్దతు తెలిపారు. అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి శాసన మండలిలో పోరాటం చేస్తామని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే మూడు పర్యాయాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించామని ఆయన వివరించారు. రిలే నిరాహార దీక్షలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి.ఎన్.సత్యనారాయణ, రాష్ట్రంలోని 13 జిల్లాల అభ్యర్థులు పాల్గొన్నారు.
12 సంవత్సరాల గా పోరాడుతూ 2008 డిఎస్పీలో సెలక్ట్ కాబడి certification verification తరువాత ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలి