- రాగల 6 గంటల్లో వాయుగుండంగా ఆ తదుపరి అల్పపీడనంగా బలహీన పడనుంది
- తిరుపతికి పశ్చిమ నైరుతిగా 30 కీమీ దూరంలో , చెన్నైకి పశ్చిమ వాయువ్య దిశగా 115 కిలోమీటర్ల దూరంలో నివర్
- చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా గంటకు 55-75 కి.మీ వేగంతో ఈదురుగాలులు
- శుక్రవారానికి తగ్గునున్న నివర్ ప్రభావం
రాగల రెండు రోజుల వాతావరణ వివరాలు:
శుక్రవారం (27/11/2020)
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి , కృష్ణా , గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు.
శనివారం (28/11/2020)
కృష్ణా , గుంటూరు , ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి ,రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు.
- వర్షాల నేపధ్యంలో వాగులు, వంకలు పొంగిపోర్లే అవకాశం
- లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- రైతులు పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
అని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలియ చేశారు.