- 19 బృందాలు తనిఖీ చేసినా…ఫలితం శూన్యం
- నేటికీ అనర్హులకు స్పౌజ్ పాయింట్లు
- 2015 వెబ్ కౌన్సెలింగ్ తర్వాత ఎస్‌ఆర్‌లో సీల్ వేయించుకోని చాలా మంది టీచర్లు
- ఇప్పుడు అవకాశం తీసుకుని అక్రమాలకు శ్రీకారం
అనంతపురం విద్య, నవంబరు 29: ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమార్కులను ప ట్టడానికి 19 బృందాలను నియమించి, తనిఖీ చేయించినా…..ఆశించిన ఫలితం రాలేదన్న వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నాటి అక్ర మాలకు 2015లోనే బీజాలు పడ్డాయన్న వా దనలూ వ్యక్తమవుతున్నాయి. పైౖగా అనర్హులకు స్పౌజ్ పాయింట్లు వేసి తొలగించకుండా డీఈఓ లాగిన్‌ఉంచారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
2015లోనే అక్రమాలకు బీజాలు
ఉపాధ్యాయ బదిలీల్లో 2015 నవంబర్‌లో తొలిసారి వెబ్ కౌన్సెలింగ్ ని ర్వహించారు. అప్పుడే చాలా మంది టీచర్లు ‘ఎస్కేప్’ అయినట్లు సమాచారం. స్పౌజ్ కేటగిరీలో వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరైన వారు…..తాము కోరుకున్న ప్లేసుల కేటాయింపు (అలాట్‌మెంట్) జరిగిన తర్వా త ఆర్డర్ కాపీలు సైతం ఆన్‌లైన్‌లో వస్తాయి. దీంతో ఆన్‌లైన్ లో వ చ్చిన బదిలీల ఆర్డర్ కాపీలను డౌన్‌లోడ్ చేసుకుని అటు నుంచి అటే చాలామంది టీచర్లు స్కూళ్లకు వెళ్లి చేరారు. తర్వాత అనేక మంది టీచర్లు స్పౌజ్ వాడుకున్నా తమ సర్వీసు రిజిస్టర్ల(ఎ్‌సఆర్)లో ముద్రలు(సీల్) వేయిం చుకోలేదు. దీంతో చాలామంది టీచర్లకు ఇప్పుడు బదిలీ ల్లో స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకుని లబ్ధిపొందడా నికి అవకాశం దొరికింది.
ఆ జాబితాలు ఎందుకు బయట పెట్టరు…?
బదిలీల్లో స్పౌజ్, ప్రిఫరెన్షియల్ కేటగిరీల్లో చాలా వరకూ బోగస్ సర్టిఫికెట్లుతో దరఖాస్తు చేశారు. దీంతో ‘ఆంరఽధజ్యోతి’లో వరుస కథనాలు వచ్చాయి. స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారులు 19 ప్రత్యేక బృందాలను నియ మించి, మెడికల్ బోర్డుకు పంపా రు. కాగా 19 బృందాలను వేసి పరిశీలించినా…..అసలైన అక్రమార్కులు తప్పించు కున్నట్టు సమాచారం. 2015 బదిలీల్లో స్పౌజ్ వాడుకున్న వారు అనేక మంది సీళ్లు వేయించుకోకుండా ఎస్కేప్ అవ్వడమే కారణం. దరఖాస్తుల పరీశీలనలో మునుపటి బదిలీల్లో స్పౌజ్, ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాడుకున్న వారి జాబితాలను ప్రదర్శించకపోవడం కూడా కారణంగా చెప్ప వచ్చు. ఇప్పుడు కూడా అసలైన అక్రమార్కులు బయట పడాలన్నా, బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నా, మునుపటి బదిలీల జాబితాలను నోటీసు బోర్డులో లేదా, డీఈఓ బ్లాగ్‌లో ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.
అనర్హులకు ఇప్పటి కీ పాయింట్లు….
బదిలీల్లో స్పౌజ్ కేటగిరీలో అనర్హులకు ఇప్పటికే పా యింట్లు వేసి, వారి దరఖాస్తులను ఒకే చేశారని సమా చారం. డీఈఓ ఆఫీ్‌సలో గతంలో పరీక్షల విభాగంలో డెప్యూటేషన్‌పై పనిచేసిన ఓ టీచర్, బెళుగుప్ప మండలం లో మరో టీచర్‌కు సంబంధించిన స్పౌజ్ డ్వామాలో టెన్నికల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి స్పౌజ్ పాయింట్లు రావు. అయితే జిల్లా విద్యాశాఖాధికా రులు ఆ కేటగిరీలో దరఖాస్తు చేసిన వారికి స్పౌజ్ పా యింట్లు వేసి దరఖాస్తులను ఆమోదించినట్టు సమాచారం. షోకాజ్ నోటీసు అందుకున్న మరో సంఘం నాయ కుడికి కూడా పాయింట్లు వేశారన్న విమర్శలు వ్యక్తమవు తున్నాయి. అక్రమార్కులపై డీఈఓ శామ్యూల్ కొరడా ఝుళిపిస్తున్నా విద్యాశాఖలోని కింది స్థాయి అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
NO RESULT AFTER SCRUTINY