మచిలీపట్నం : ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీఈవో రాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం బదిలీల అంశపై జిల్లాలోని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బదిలీలపై ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. జిల్లాలో ఉపాధ్యాయుల ఖాళీలు ప్రకటించాలని పలువురు నాయకులు కోరగా ఖాళీల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రభుత్వ నిర్దేశించిన సమయానికి అందుబాటులో ఉంటాయని అన్నారు. ఛైల్డ్‌ఇన్‌ఫోలో విద్యార్థుల వివరాలను నమోదు చేసే సమయంలో ఇంగ్లీషు మాధ్యమం అని నమోదు చేస్తే వేరే మాధ్యమాలుగా తీసుకుంటున్నట్లు డీఈవో దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం ఖాళీలను ప్రదర్శించాలని కొన్ని సంఘాల నాయకులు కోరారు. హేతుబద్ధీకరణ, బదిలీల జీవోలో ఉన్న కొన్ని అంశాలను తొలగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఇలా వివిధ అంశాలపై సమీక్షించారు. వివిధ సంఘాల నాయకులు లెనిన్‌బాబు, మనోహర్, నాగరాజు, కొమ్ముప్రసాదు తదితరులు పాల్గొన్నారు.