- బదిలీలకు ఎన్ని సార్లు అయినా అప్ప్లికేషన్లు పెట్టుకోవచ్చు
- తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు
ఏలూరు: ఉపాధ్యాయ బదిలీల విధానం పై ఎం.ఈ.వో, డీవైఈవో లకు ప.గో డి.ఈ.వో శ్రీమతి సి.వి.రేణుక సూచనలు జారీ చేశారు. ఉపాధ్యాయులు తప్పుగా నమోదు చేసి సబ్మిట్ చేసే దరఖాస్తు లని ఆన్లైన్ లో తిరస్కరించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు బదిలీలకు ఎన్ని సార్లు అయినా అప్ప్లికేషన్లు పెట్టుకోవచ్చు అయితే వారు ముందుగా వారు సబ్మిట్ చేసిన దరఖాస్తులని డిలీట్ చేయాలి. షెడ్యూల్ లోపు కొత్త దరఖాస్తు ను సబ్మిట్ చేయాలి. ఉపాధ్యాయులు తప్పుడు సమాచారం ఇచ్చి దరఖాస్తు సమర్పిస్తే చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. స్పౌజ్ కోటా లో దరఖాస్తు చేసే వాళ్ళు వారి స్పౌజ్ కి దగ్గరగా ఉండే పాఠశాల ను మాత్రమే ఎంపిక చేసుకోవాలని, స్పౌజ్ కి దూరంగా ఉండే ఎక్కువ హెచ్.ఆర్.ఏ ఉండే ప్రాంతాల లోని పాఠశాల ను కోరుకోవడానికి వీలు లేదని తెలిపారు.