అమలాపురం, నవంబరు 28: కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరిట జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష ఆది,సోమవారాలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర కోఆర్డినేటర్ పీవీఎల్‌ఎన్.శ్రీరామ్ తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థు లకు ఓపెన్ బుక్ పద్ధతి ద్వారా ఇంటి వద్ద నుంచే ఈపరీక్ష రాసుకునే అవకాశాన్ని కల్పించారు. రిజిష్టర్ చేయించుకున్న విద్యార్థులు ఎంచుకున్న రోజున ఉదయం 10 గంటల నుంచి 8గంటల మధ్యలో 90 నిమిషాలు పరీక్ష నిర్వహిస్తామన్నారు. 6,7,8 తరగతుల విద్యార్థులకు జూనియర్ విభాగంలో, 9,10,11 తరగతులకు సీనియర్ విభాగంలో వంద బహుళైచ్ఛిక ప్రశ్నలకు వంద మార్కులు ఉంటాయని వివరించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఇతర భారతీయ భాషల్లో పరీక్ష రాసుకునే వెసులుబాటు కల్పించామన్నారు.