- ధర్నాకు పిడిఎఫ్ మద్దతు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: డిఎస్సి -2008 అభ్యర్థులకు న్యాయం చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విజయవాడలోని ధర్నాచౌక్ లో ‘జగనన్న మీద అలక’ పేరుతో 2008 అభ్యర్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనకు పిడి ఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, రాము సూర్యారావు స్వతంత్ర ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పి రఘువర్మ మంగళవారం మద్దతు తెలిపారు వీరికి న్యాయం చేయాలని శాసనమండలిలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి కోరారు. న్యాయ సలహా తీసుకుని త్వరలో నియామక ఉత్తర్వులు ఇస్తామని మంత్రి ఎమ్మెల్సీలు తెలిపారు.
పాలిటెక్నికల్ లెక్చరర్లకు బదిలీలు నిర్వహించాలి
పాలిటెక్నికల్ లెక్చరర్లకు బదిలీల ఉత్తర్వులు త్వరగా జారీచేయాలని స్కిల్ డెవలప్మెంట్ మంత్రి మేకపాటి గౌతంరెడ్డిని పిడిఎఫ్ సభ్యులు మండలిలో కోరారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నియామకాలు నూతన లెక్చరర్లకు పోస్టింగులు ఇచ్చేలోపే బదిలీలు చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే పనిచేస్తున్నవారికి తొలగించొద్దని, వృత్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ లో మాట్లాడి ఉత్తర్వులు ఇప్పిస్తామని మంత్రి ఎమ్మెల్సీలకు హామీనిచ్చారు.
GIVE POSTINGS TO DSC 2008 CANDIDATES