అమరావతి బ్యూరో: డిఎస్సి 2008లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని
నిరుద్యోగ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలోని అలంకార్ సెంటర్ లో వివిధ జిల్లాల నుండి వచ్చిన 2008 డిఎస్సీ క్వాలిఫై అభ్యర్థులు జగనన్న మీద ఆలక పేరుతో నిరసన దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా బిఇడి నిరుద్యోగ అభ్యర్థుల సంఘం కన్వీనర్ వెలుగుజ్యోతి మాట్లాడారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన జంబో డిఎస్ సిలో బిఇడి అభ్యర్థులకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. వందకు 77 మార్కులు వచ్చినా ఉద్యోగం ఇవ్వలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2008 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తామని మే నెలలో వివరాలను తీసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి 2008లో అన్యాయానికి గురైన 2193 మంది నిరుద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. ఈ దీక్షా శిబిరానికి విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ వెంకట్రామిరెడ్డి వచ్చి అభరులతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తమతో మాట్లాడమని తనను పంపారని చెప్పారు. తమ అభ్యర్ధనను ప్రభుత్వం పరిశీలిస్తోందని అభ్యర్థులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిమ్మమరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
JUSTICE FOR DSC 2008 CANDIDATES