ఒంగోలువిద్య, డిసెంబరు 2 : జిల్లాలోని 39 మంది ఎంఈవోలకు మెమో లు జారీ చేస్తూ డీఈవో వీఎస్.సుబ్బారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు. జగనన్న విద్యా కానుక పంపిణీకి సంబంధించి బయోమెట్రిక్ అంధంటి కేషన్లో వెనుకబడినందుకు వారికి మెమోలు జారీ చేశారు. జిల్లాలో 3,15,171 మంది బాలబాలికలకు విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. కిట్లు అందుకున్న విద్యార్థుల తల్లులు, బయోమెట్రిక్ లేదా ఐరిస్ అంథటికేషన్ ఉంటేనే విద్యార్థు ల యూని ఫారాలకు కుట్టుకూలీ చార్జిని తల్లుల ఖాతాకు జమ చేస్తారు. ఇ పృపటివరకు 67 శాతం మాత్రమే బయోమెట్రిక్ పూర్తయింది. 39 మండలాల్లోని కొన్ని పాఠశా లల్లో విద్యాకానుక కిట్లు పంపిణీ చేసినప్పటికి ఇప్పటి వరకు ఒ క్కరి బయోమెట్రిక్ అథంటికేషన్ నమోదు కాలేదని డీఈవో పేర్కొన్నారు.
MEMOS TO 39 MEO’S