- రాయలసీమ లోని ఒక్క జిల్లాలో కూడా విడుదల కాని వైనం
- కోస్తాలో శ్రీకాకుళం, ప.గో, విశాఖపట్నం మినహా మిగిలిన జిల్లాల జాబితాలు విడుదల
అమరావతి, న్యూస్ టోన్: బదిలీల సీనియారిటీ జాబితాలు విడుదలలో ఇంకా జాప్యం జరుగుతుంది. షెడ్యూల్ తేదీ ముగిసినప్పటికీ ఇంకా ఏడు జిల్లాల్లో జాబితాలు విడుదల కాక పోవడం గమనార్హం. ఇప్పటికి ఆరు జిల్లాల సీనియారిటీ జాబితాలు విడుదల అయ్యాయి. ఈ జాబితాలు https://teacherinfo.ap.gov.in/TEACHERTRANSFER20APPL/downloadSeniorityListService.apt వెబ్ లింక్ లో అందుబాటు లో ఉన్నట్లు ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులు తెలిపారు. సదరు జాబితాల పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 3,4 తేదీలలో https://teacherinfo.ap.gov.in/TEACHERTRANSFER20APPL/registerGrievances.apt నందు ఉపాధ్యాయులు తమ అభ్యంతరాలు పంపాలని ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులు తెలిపారు. కేవలం ఆన్లైన్ ద్వారా పంపిన అభ్యంతరాలు మాత్రమే పరిశీలిస్తామనీ, ఆఫ్లైన్ ద్వారా తెలిపే అభ్యంతరాలు స్వీకరించమని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయులు తెలిపైన అభ్యంతరాలని జాయింట్ కలెక్టర్ 5 నుండి 7 తేదీలలో అప్రూవ్ చేస్తారు. తదుపరి పాయింట్లు ఆధారంగా తుది సీనియారిటీ జాబితాలను 8 నుండి 10 తేదీలలో విడుదల చేస్తారు. ఈ జాబితాల ఆధారంగా ఉపాధ్యాయులు 11 నుండి 15 తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ ను నమోదు చేయటకు అవకాశం ఇస్తారు.
DELAY IN RELEASING SENIORITY LISTS