అమరావతి ఆంధ్రజ్యోతి: నవంబర్ నెల డ్రై రేషన్ సరుకులను విడుదల చేశారు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఒక్కొక్కరికి 2.4 కిలోలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఒక్కొక్క రికి 3.6 కిలోల ఆహార ధాన్యాలను / బియ్యం ఇవ్వను న్నారు. వీటితోపాటు కంది పప్పు, ఒక్కొక్కరికి 18 చొప్పున గుడ్లు, 18 చొప్పున చిక్కీలు పంపిణీ చేస్తారు. కొత్తగా అడ్మిషన్లు తీసు కున్న విద్యార్థులకు డైరేషన్ సరుకులు ఇస్తారు. ప్రస్తుతం 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తరగతులకు హాజరై మధ్యాహ్న భోజన పథకం ఆహార పదార్థాలను తీసుకుంటున్న విద్యార్థులకు మాత్రం డ్రై రేషన్ సరుకులు ఇవ్వరు. ఒకవేళ భోజన పథకాన్ని వినియోగించుకోకపోతే సంబంధిత విద్యార్థులకు డ్రైరేషన్ సరుకులు ఇస్తారు. ఆ ప్రకారం జిల్లాలో 8, 9, 10 తరగ తులు చదువుతున్న విద్యార్థులు 93,158 మంది ఉండగా వీరిలో భోజన పథకాన్ని ఎంత మంది వినియోగించుకుం టున్నదీ, లేనిదీ లెక్కలు తేల్చే పనిని ప్రారంభించారు కంది పప్పు ఇవ్వని పక్షంలో కుకింగ్ ఛార్జీలను చెల్లిస్తారు. జిల్లాలో వచ్చే వారం నుంచి నవంబర్ డ్రై రేషన్ సరుకుల ను పంపిణీ చేయనున్నారు.
DRY RATION FOR NOVEMBER