- తగ్గించిన వేతనాలు చెల్లింపుకు కీలక ఉత్తర్వులు
- మార్చి వేతనాలు డిశంబర్ లో, ఏప్రిల్ వేతనాలు జనవరి లో
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్
కారణంగా మార్చి నెలలో వాయిదా వేసిన పెన్షన్లు, వేతనాలను డిసెంబర్ నెలలో
చెల్లించనున్నట్లు ప్రకటిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు
ఏప్రిల్ నెల బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య
కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఆదేశించారు. కాగా, ఏప్రిల్ నెలలో తగ్గించిన
వేతనాలను కూడా డిసెంబర్ లేదా 2021 జనవరి నెలలో చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం
స్పష్టం చేసింది. అటు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష
టీడీపీ మధ్య వాడీవేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
PENDING SALARIES TO EMPLOYEES