- తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదల
- పోస్టుల బ్లాక్‌పై టీచర్లలో ఆందోళన
- వాటిలో సిఫారసు బదిలీలు చేస్తారంటూ ఆరోపణ
- టీచర్ల కొరతలేకుండా చేసేందుకేనంటున్న డీఈవో
గుంటూరు(విద్య), డిసెంబరు 3: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీగ్రేడ్, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్ ఇలా క్యాడర్‌వారీగా జాబితాను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలించి వాటిని జేసీ ఆధ్వర్యంలో పరిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఉపాధ్యాయుల బదిలీల్లో కొన్ని పోస్టులు బ్లాక్ చేస్తున్నారని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,425 సెకండరీగ్రేడ్ టీచర్ పోస్టులు ఖాళీలుంటే కౌన్సెలింగ్‌లో 1640 మాత్రమే చూపుతున్నారని సంఘాలు ఆరోపిస్తున్నాయి. దాదాపు 775(33శాతం) పోస్టులు ఈ క్యాడర్‌లో బ్లాక్ చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెబుతున్నారు. ఉన్నత పాఠశాల్లో సైతం 200వరకు పోస్టులు బదిలీ కౌన్సెలింగ్‌లో చూపడం లేదు. దీనివల్ల అర్హులైన ఉపాధ్యాయులు బదిలీలు కోరుకునే అవకాశం కోల్పోతారని చెబు తున్నారు. బ్లాక్ చేసిన పోస్టుల్లో అత్యున్నత స్థాయిలో వచ్చిన సిఫార్సు బదిలీలు చేస్తారని ఆరోపిస్తున్నారు. ఈ పోస్టుల్లో డీఎస్సీ 2008లో క్వాలిఫై అయిన మినిమం టై మ్‌స్కేల్ ఉపాధ్యా యుల్ని నియ మించాలనే విజ్ఞ ప్తులు కూడా ఉన్నాయి. వెబ్ కౌన్సెలింగ్ వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యక్ష కౌన్సెలింగ్‌లో ఎక్కడ ఏఏ ఖాళీలు ఉన్నాయనే విషయం తెలుస్తుందని, వెబ్ కౌన్సెలింగ్‌లో ఈ అవకాశం లేదనే వాదన ఉంది. దీనిపై డీఈవో ఆర్‌ఎస్ గంగాభవాని స్పదిస్తూ.. జిల్లాలో అన్ని ప్రాంతాల్లోని స్కూల్స్‌లో సమంగా ఉపాధ్యాయులు ఉండాలంటే కొన్ని పోస్టులు బ్లాక్ చేయడం తప్పదని పేర్కొన్నారు. లేకుంటే పల్నాడు, బాపట్ల, పిడుగురాళ్ళ వంటి సూదూర ప్రాంతాల్లోని స్కూల్స్‌లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్‌పై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
POSTS BLOCKED