- 1500 పైగా బదిలీ స్థానాలు బ్లాక్ చేయడంపై టీచర్ల ధ్వజం
ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 5: మూడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత నిర్వహిస్తోన్న టీచర్ల సాధారణ బదిలీలకు జిల్లాలో పెద్ద సంఖ్యలో వేకెన్సీ లను బ్లాక్ చేయడంపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లు ఇకనైనా మంచి స్థానానికి బదిలీ కోరుకోవచ్చునన్న ఆశలపై విద్యాశాఖ నిర్ణయాలు నీళ్ళు చల్లాయి. అందుబాటులో ఉన్న అన్ని వేకెన్సీలను బదిలీ కౌన్సెలింగ్‌కు చేర్చకుండా ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల వల్ల ఉపాధ్యా యులు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో అన్ని కేడర్లు, సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 4084 వేకెన్సీలు ఉండగా, ప్రస్తుత బదిలీ కౌన్సెలింగ్‌లో వీటన్నింటిని ప్రదర్శించకుండా కేవలం 2537 వెకెన్సీలను మాత్రమే చూపడం పట్ల టీచర్లలో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయి.
ఎస్‌జీటీ కేడర్‌లో ఏకంగా 1199 వేకెన్సీలు బ్లాక్
ఒకే స్కూలులో 8 సంవత్సరాలు పనిచేసిన టీచర్లందరినీ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జిల్లాలో స్కూలు అసిస్టెంట్, ఎస్‌జీటీ, కేడర్లలో మొత్తం 1936 మంది టీచర్లు కంపలసరీ ట్రాన్స్‌ఫర్ ఉంది. ఇక మొత్తం 4084 వేకెన్సీలు జిల్లాలో ఉండగా వీటిలో సాధారణ బదిలీ కౌన్సెలింగ్‌కు కేవలం 2537 వెకెన్సీలు మాత్రమే చూపించి మిగతా 1547 వెకెన్సీలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్లాక్ చేశారు. ఇలా బ్లాక్ చేసిన వేకెన్సీల్లో 1199 ఎస్‌జీటీ క్యాడర్ నుంచే ఉండడం గమనార్హం. ఎస్‌జీటీ కేటగిరిలో 1936 మంది తప్పనిసరి బదిలీ కావాల్సి ఉండగా 2555 వెకె న్సీలు (ప్లెయిన్ ఏరియాలో) అందుబాటులో ఉంటే వాటిలో 1356 వెకెన్సీలను మాత్రమే ప్రదర్శించారు.
సిఫార్సు బదిలీల కోసమేనా ?
పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న రోడ్డు పక్క న ఉండే పాఠశాలల్లోని వెకెన్సీలనే బ్లాక్ చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలా బ్లాక్ చేసిన స్థానాలను రాజకీయ సిఫార్సులకు భర్తీ చేయ డానికి ఉద్దేశించినవేనని విమర్శించాయి. కాగా జిల్లా విద్యాశాఖ వర్గాలు మాత్రం టీచర్ల వాదనను ఖండి స్తున్నాయి. మారుమూల ప్రాంత పాఠశాలల్లోని వెకెన్సీ లు కూడా భర్తీ అయ్యేందుకే ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు బ్లాక్ చేసినట్లు వివరించాయి. దీని వల్ల అన్ని పాఠశాలలకు టీచర్లు సమన్యాయంగా అందు బాటులో ఉంటారని చెబుతున్నాయి.
VACANCIES BLOCKED TEACHERS SHOCKED