- హెచ్.ఎం, ఎస్.ఏ (తెలుగు, హిందీ, పి.డి) వారు మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వాలి
- కోర్టు కేసుల కారణంగా వీరికి మళ్ళీ మొదటికి ఆప్షన్స్ ప్రక్రియ
న్యూస్ టోన్, అమరావతి: కోర్టు కేసుల కారణంగా హెచ్.ఎం, ఎస్.ఏ (తెలుగు, హిందీ, పి.డి) వారికి బదిలీల ప్రక్రియ మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే ఇది కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, హెచ్.ఎం లకు సంబంధించి క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు వారు మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వాలి. స్కూల్ అసిస్టెంట్ పి.డి కి కర్నూలు వారు మాత్రమే ఆప్షన్స్ ఇవ్వాలి. ఈ ఆప్షన్స్ ప్రక్రియ ఈ నెల 22 నుండి 26 వరకు 5 రోజుల పాటు కొనసాగుతుంది అని సి.ఎస్.ఈ వారు ఇచ్చిన ఉత్తర్వు లలో పెర్కోన్నారు. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ లకు అనుగుణంగా సి.ఎస్.ఈ వారు బదిలీల ప్రక్రియ చేపట్టి ఉంటే బదిలీల ప్రక్రియ నవంబర్ లోనే ముగిసిపోయేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.