AC Prices Hike: సమ్మర్‌ను కూల్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా.? ఈ
వేసవికి ఏసీ, ఫ్రిడ్జ్‌లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే
త్వరపడండి. వచ్చే నెల వరకు ఆగారంటే ధరలు భగ్గుమననున్నాయి. ఏప్రిల్ నుంచి
ఏసీ, ఫ్రిడ్జ్‌ల ధరలు 5 నుంచి శాతం పెరగనున్నాయని ఇప్పటికే పలు కంపనీలు
ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం, ధరలు పెరగడంతో ధరలు
పెంచకతప్పడం లేదని సంస్థలు ప్రకటించాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఏసీలు, రిఫ్రిజిరేటర్ల తయారీ
సంస్థ బ్లూస్టార్ వినియోగదారులపై ధరల భారం పెంచడానికి సిద్ధమవుతోంది.
ఏప్రిల్ నెల నుంచి అన్ని రకాల ఉత్పత్తుల ధరలను పెంచబోతున్నట్లు
ప్రకటించింది. ముడి సరుకులు, రవాణా చార్జీలు అధికమవడంతోనే ధరలు
పెంచకతప్పదని బ్లూస్టార్ ఎండీ బీ త్యాగరాజన్ స్పష్టం చేశారు. తాజాగా
మార్కెట్లోకి కొత్తగా ఏసీలను విడుదల చేసిన అనంతరం త్యాగరాజన్ మాట్లాడుతూ..
ఈ ఏడాది ఏసీల మార్కెట్ 15 నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉందని
తెలిపారు. ఇక కొత్తగా తీసుకురానున్న ఏసీలు రూ.18,990 ప్రారంభ ధరలో
లభించనున్నాయని వివరించారు. ఇక శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న బ్లూస్టార్
ప్లాంట్ కోసం రెండో విడుతలో మరో రూ.270 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు
త్యాగరాజన్ ప్రకటించారు.