- ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలను తక్కువగా పంపిణీ చేసారంటూ వస్తున్న వార్తలను ఏపీ విద్యాశాఖ ఖండించిది.
- వాస్తవాలను వివరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
- 2019 సెప్టెంబర్ లో ఉన్నయూడైస్ డేటా ఆధారంగా అవసరమైన పాఠ్యపుస్తకాలకు, 5% అదనంగా చేర్చి పుస్తకాలు ముద్రించామని తెలిపింది.
- 2020 మే కల్లా ఆ పుస్తకాల ముద్రణ పూర్తి అయ్యాయని వివరించింది.
- కోవిడ్ పరిస్థితుల అనంతరం 2020 అక్టోబర్లో జగనన్న విద్యాకానుక ద్వారా పుస్తకాలను పంపిణీ చేసినట్టు తెలిపింది.
- 3-11-2020 నుండి 6-3-2021 మధ్య కాలంలో అత్యధికంగా ప్రైవేటు నుండి ప్రభుత్వ
బడుల్లో చేరికలు పెరిగడంతో వెంటనే అదనపు పుస్తకాల ముద్రణకు 4 మార్చి 2021న
రూ.7 కోట్లు మంజూరు చేసినట్టు తెలియజేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల కొరతపై ప్రభుత్వం స్పందించింది.
దీనిపై వివరంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో
విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పుస్తకాల కొరత ఎదురైందని, మరో 15
రోజుల్లో మిగిలిన పుస్తకాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపింది.
సాధారణంగా పాఠ్యపుస్తకాల ముద్రణ యూడైస్ డేటా ఆధారంగా జరుగుంది.
30-09-2019 నాటికి ఉన్న విద్యార్థుల వాస్తవ సంఖ్య ఆధారంగా ప్రభుత్వం
పాఠ్యపుస్తకాల ఇండెంట్ రూపొందించింది. దీని ప్రకారం ఏపీ వ్యాప్తంగా ఉన్న
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య 38,97,156. దీనికి అదనంగా 5% కలిపి
ప్రభుత్వం పుస్తకాలను ముద్రించేందుకు ఆదేశించింది. అంటే 40,92,014 మందికి
పాఠ్యపుస్తకాల ముద్రించారు. 2020 నవంబర్లో ఉపాధ్యాయ బదిలీల సమయంలో
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు 40,84,983 గా ప్రభుత్వం
గుర్తించింది. ఈ సంఖ్య మరో నెలలో అనగా 19.12.2020 అమ్మ ఒడి పథకానికి
సంబంధించి విద్యార్థుల వివరాలను సేకరించే సమయానికి మరింత పెరిగి 43,89,952
అయ్యింది. అనగా ప్రభుత్వం అంచనా వేసుకున్న 5% కంటే అదనంగా 2,97,938 మంది
విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో నమోదు అయ్యారు. ఈ సంఖ్య 2021 మార్చి నాటికి
45,03,441 కి చేరింది. అంటే ముద్రించిన పుస్తకాల కంటే 4,11,427 అధికంగా
విద్యార్థుల నమోదు జరిగింది.
ప్రస్తుతం ప్రభుత్వం అదనంగా
పాఠ్యపుస్తకాల ముద్రణకు అన్ని ఏర్పాట్లు చేపట్టింది. 4మార్చి 2021న
సమగ్రశిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఇందుకోసం రూ.7కోట్లు మంజూరు చేసారు.
రానున్న 15 రోజుల్లో పుస్తకాలను విద్యార్థులకు అందించడం జరుగుతుందని
విద్యాశాఖ తెలిపింది.
విద్యారంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్లే ప్రభుత్వ
బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఈ
అనుభవం దృష్ట్యా రానున్న విద్యా సంవత్సరానికి మరింత ప్రణాళికా బద్ధంగా
చర్యలు చేపడతామని ప్రభుత్వం తెలియజేసింది.