SBI WECARE Scheme: ప్రముఖ
ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of india-SBI)
తాజాగా కీలక ప్రకటన చేసింది. వీ కేర్ స్కీంలో చేరేందుకు గడువును
పొడిగించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ బ్యాంకు కొన్ని నెలల కింద వృద్ధుల కోసం ప్రత్యేకంగా SBI WECARE పేరుతో
ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంను తీసుకు వచ్చింది. సీనియర్ సిటిజన్స్‌కు అధికంగా
వడ్డీ అందించాలనే లక్ష్యంతో ఎస్‌బీఐ ఈ స్కీంను ప్రారంభించింది.
అయితే మొదట సెప్టెంబర్ వరకు ఈ స్కీంలో చేరేందుకు గడువు విధించారు. అనంతరం
కరోనా నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించారు. మళ్లీ ఈ గడువును
మార్చి 31 వరకు పొడిగిస్తూ బ్యాంక్ గతంలో నిర్ణయం తీసుకుంది.
అయితే తాజాగా ఈ గడువును బ్యాంకు మరో సారి పొడిగించింది. ఈ స్కీంలో జూన్ 30 వరకు చేరొచ్చని తెలిపింది.
సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్లతో పోలిస్తే ‘ఎస్‌బీఐ వీకేర్’ ఫిక్స్‌డ్
డిపాజిట్ ద్వారా వృద్ధులు 0.80 శాతం వడ్డీ అధికంగా పొందొచ్చు.
సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కన్నా సీనియర్ సిటిజన్లకు అరశాతం
అంటే 0.50 శాతం వడ్డీని అధికంగా ఇస్తుంటాయి. ‘ఎస్‌బీఐ వీకేర్’ ఫిక్స్‌డ్
డిపాజిట్ ద్వారా 0.30 శాతం అధికంగా వడ్డీ పొందొచ్చు.
ఐదేళ్లు లేదా ఆపైన కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ వడ్డీ
వర్తిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని SBI సీనియర్ సిటిజన్స్
ను కోరుతోంది.