ఆంధ్ర ప్రదేశ్ లో పది పరీక్షలపై స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వీ. చినభద్రుడు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా నేపథ్యంలో ఏపీలో ఈ నెల 5 నుంచి జరగాల్సి ఉన్న ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.
అయితే టెన్త్ ఎగ్జామ్స్ ను కూడా వాయిదా వేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కొంత మంది విద్యార్థులు ఈ విషయమై హై కోర్టును కూడా ఆశ్రయించడంతో విచారణ సైతం జరుగుతోంది.
ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వీ. చినభద్రుడు తాజాగా కీలక ప్రకటన చేశారు.
వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులోని జీఎంసీ బాలయోగి సైన్స్ పార్కును ఆయన బుధవారం సందర్శించారు
ఈ సందర్భంగా చినవీరభద్రుడు మీడియాతో పది పరీక్షల విషయమై మాట్లాడారు.
పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ఈ నెలాఖరులో స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
అయితే ..కొందరు టీచర్లు ఇందుకు సహకరించకపోగా.. అనవసరంగా రాద్ధాంతాలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.