Cabinet Decisions 04.05.2021: రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలు
సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి. పలు నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు,రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) మంగళవారం నాలుగో బ్లాక్ , పబ్లిసిటి సెల్ లో మీడియాకు వివరించారు.
ఆయన మాటల్లోనే…
- మరో 10 ఏళ్ల పాటు బీసీ రిజర్వేషన్లు పొడిగింపు
- కోవిడ్ 19 నియంత్రణకు మరింత నిర్దిష్ట చర్యలు
- ప్రతి మండలంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు
- విరివిగా కోవిడ్ పరీక్షలు. 24 గంటల్లో ఫలితం
- సీబీఎస్‌ఈతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం
- 44,639 పాఠశాలలు దశలవారీగా అనుసంధానం
- ఆయా స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియమ్‌లో బోధన
- 2021 – 22లో సీబీఎస్‌ఈ సిలబస్‌తో 7వ తరగతి పరీక్షలు
- 2024 – 25లో అదే సిలబస్‌తో 10వ తరగతి పరీక్షలు
- సహకార రంగంలోని డెయిలీల పునరుద్ధరణకు చర్యలు
- వచ్చే మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమూల్ పాల సేకరణ
- శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలలో పశు సంవర్థక పాలిటెక్నిక్‌లు
- మత సామరస్యం పెంపొందించే దిశలో మరో ముందడుగు
- అర్దకులు, ఇమామ్‌లు, మౌజమ్‌లు, పాస్టర్లకు వేతనాల పెంపు
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరింత బలోపేతం దిశగా చర్యలు
- కొత్తగా 176 పీహెచ్‌సీల ఏర్పాటు. 2464 పోస్టులు మంజూరు
- అసైన్డ్ భూములు సేకరిస్తే, ఎక్కువ పరిహారం చెల్లింపు
- ఎస్‌ఆర్ స్టీల్ కంపెనీకి కడప స్టీల్ ప్లాంట్ పనుల అప్పగింత
- పోలవరం, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుల విస్తరణ
మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
మరో 10 ఏళ్ల పాటు బీసీ రిజర్వేషన్లు:
విద్యా సంస్థలు, సర్వీసుల్లో బీసీలకు (ఏ,బీ,సీడీ మరియు ఈ) రిజర్వేషన్లు మరో 10 ఏళ్ల పొడిగింపు. ఉద్యోగాల భర్తీలో గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు. ఆ మేరకు ఈ ఏడాది జూన్ 1 నుంచి 2031 మే 31 వరకు అవన్నీ వర్తింపు.
సీబీఎస్‌ఈతో ఎంపియూ:
ఇంగ్లిష్ మీడియమ్‌లో విద్యాబోధనతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా సీబీఎస్‌ఈతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్జుకోనుంది. ఆ మేరకు రాష్ట్రంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలలను దశలవారీగా అనుసంధానం చేసుకునే ప్రక్రియతో పాటు, ఇంగ్లిష్ మీడియమ్‌లోనే విద్యా బోధన కొనసాగుతుంది. ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్లతో పాటు, విద్యా సంస్థల అధికారులు సీబీఎస్‌ఈ సిలబస్, ఆ పరీక్షలను అలవర్డుకునే విధంగా వారికి తగిన అవగాహన కల్పిస్తారు. 2021:,22 విద్యా సంవత్సరంలో 7వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌తో పరీక్షలు రాస్తే, 2024:ష25లో 10వ తరగతి విద్యార్థులు అదే సిలబస్‌తో పరీక్షకు హాజరవుతారు. ఒకవైపు విద్యా ప్రమాణాల పెంపు, మరోవైపు నాడుకృనేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుతుండడంతో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 6.12 లక్షల విద్యార్దులు చేరగా, వారిలో 4 లక్షలకు పైగా విద్యార్దులు పైవేటు విద్యా సంస్తల నుంచి వచ్చిన వారు కావడం విశేషం.
సాల్ట్ కు ప్రపంచ బ్యాంక్ రుణం:
సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్సఫర్మేషన్’ (సాల్ట్)కు మంత్రి మండలి పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్ నుంచి 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1860 కోట్లు) రుణం సేకరిస్తుండగా, ఆ నిధులతో నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా టీచర్లకు వృత్తిపరమైన నైపుణ్యం పెంచడం, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియమ్ ప్రవేశపెట్టడం వంటి వాటి కోసం కూడా ఆ నిధుల వినియోగిస్తారు.
ఎయిడెడ్ విద్యా సంస్థల టేకోవర్:
ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం టేకోవర్ చేస్తుంది. ఏ మాత్రం ఆర్థిక భారం పడకుండా ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. అందుకు అనుగుణంగా ఏపీ విద్యా చట్టం 1982లో సవరణలను మంత్రి మండలి ఆమోదించింది. ఎయిడెడ్ విద్యా సంస్థలను టేకోవర్ చేయడం వల్ల ఎవరికీ నష్టం కలగదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పైవేటు యూనివర్సిటీల చట్టం సవరణ:
ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్టం – 2016కు సవరణను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ప్రైవేటు వర్సిటీలలో 35 శాతానికి మించకుండా ప్రభుత్వం కోటా ఉంటుంది. ఆ కోటాలో సీట్లు కేటాయించిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్‌స్‌మెంట్‌తో పాటు, స్కాలర్‌షిప్ కూడా ఇస్తారు. ప్రెవేటు విద్యా సంస్థలలో 35 శాతం ప్రభుత్వ కోటా వల్ల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా నైపుణ్యం అభివృద్ధి చెందడంతో పాటు, వారికి ఉద్యోగ అవకా((శాలు కూడా మెరుగవుతాయి. ఇక బ్రౌన్‌ఫీల్డ్ ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు వల్ల ప్రపంచ సాయి విద్య అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఉన్నత విద్యా రంగం మరింత బలోపేతం అవుతుంది.
మంత్రి వర్గ నిర్ణయాలు పూర్తి కాపీ ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొండి.