Friday, November 8, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Health Benefits with Guava Leaves: జామ...

AP : November 2024 Session Department Tests

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెక్షన్ సెషన్ లో...

APTET July 2024 Rsults out now. Check result on this direct link

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలను ఈ...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

How to check School Grant balance in PFMS login

Andhra Pradesh school education department sanctioned an amount of...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Health Benefits with Guava Leaves: జామ ఆకులతో 8 ఆరోగ్య ప్రయోజనాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Health Benefits with Guava Leaves: జామ ఆకులతో 8 ఆరోగ్య ప్రయోజనాలు

జామపండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో… జామ ఆకులతోనూ చాలా ఉన్నాయి. జామ ఆకులతో టీ తయారుచేస్తారని తెలుసా. జామకాయలు, ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ c, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. అందుకే మనం జామకాయల్ని తినాలి, ఆకుల రసం తాగాలి. జామపండ్లను తింటే జలుబు వస్తుందని పెద్దవాళ్లు అంటుంటారు. అందువల్ల మరీ బాగా ముగ్గినవి కాకుండా దోరగా ఉన్నవి తింటే మేలు. జామకాయలు మన దేశంలో కంటే… మధ్య అమెరికాలో ఎక్కువగా కాస్తాయి. అక్కడి నుంచే ఈ చెట్లు ప్రపంచమంతా విస్తరించాయి. ఎండ వాతావరణంలోనే పెరిగే ఈ కాయలు… ఏడాదంతా కాస్తూనే ఉండటం మనకు కలిసొచ్చే అంశం. మరి జామకాయల ఆకులతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

జామ పండ్ల ఆకుల రసం తాగితే… మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమపద్ధతికి చేరతాయి. చాలా ఎక్కువసేపు బ్లడ్ షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్ ఉండేవారికి ఇది ఎంతో మేలు చేసే అంశం. అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే కలిసొస్తుంది. దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఓ నాలుగు జామ ఆకుల్ని నీటిలో పది నిమిషాలు ఉడికించి, ఆ నీటిని తాగేయడమే. ఈ నీరు రుచిగా ఉండకపోయినా… ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలాగే తాగేయడం మేలు. మార్కెట్లలో జామ ఆకుల టీ ప్యాకెట్లు లభిస్తున్నాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు… విషవ్యర్థాలను చంపేసి… గుండెకు మేలు చేస్తాయి. జామకాయల్లోని పొటాషియం, కరిగిపోయే ఫైబర్… గుండెను కాపాడతాయి. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. హైబీపీ, చెడు కొలెస్ట్రాల్ వంటివి గుండె జబ్బులకు కారణమవుతాయి. అందువల్ల జామ ఆకుల రసం తాగాలి. 

మహిళల్లో పీరియడ్స్ టైమ్‌లో చాలా మంది మహిళలు పొట్టలో నొప్పి వస్తున్నట్లు బాధపడతారు. జామ ఆకుల రసం ఈ నొప్పులను అదుపుచేస్తుంది. రోజూ ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది.

జామకాయలు జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. ఎంత ఎక్కువగా జామకాయలు తింటే అంతగా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం పారిపోతుంది. ఒక జామకాయ… మన రోజువారీ అవసరమయ్యే ఫైబర్‌లో 12 శాతం ఇస్తుంది. జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డయేరియా (విరేచనాలు)కి చెక్ పెడుతుంది.

జామకాయల్లో కేలరీలు తక్కువ. అందువల్ల ఇవి తింటే ఆకలి తీరుతుంది. అలాగే ఎక్కువ కేలరీలు బాడీకి చేరవు. పైగా వీటిలోని విటమిన్లు, మినరల్సూ మేలు చేస్తాయి.

కాన్సర్ వస్తే… దాన్ని వదిలించుకోవడం ఓ సాహసమే. అసలు కాన్సరే రాకుండా చేసుకుంటే బెటర్ కదా. జామ ఆకుల్లో కాన్సర్‌ను నిరోధించే గుణాలున్నాయి. కాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా కూడా ఇది చేస్తుంది. కణాలను కాపాడుతుంది. కాన్సర్ మందుల కంటే… జామ రసం నాలుగు రెట్లు ఎక్కువగా ప్రభావం చూపించగలదని పరిశోధనల్లో తేలింది. జామకాయలు, ఆకుల్లో విటమిన్ సీ ఉంటుంది. ఇది వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఓ ఆరెంజ్ తింటే వచ్చే సీ విటమిన్ కంటే డబుల్ సీ విటమిన్ జామకాయను తింటే వస్తుంది. బాడీకి వ్యాధులు రాకుండా ఉండాలంటే… సైలెంట్‌గా జామకాయలు తినేస్తూ ఉండాలి. మనకు వేడి చేసినప్పుడు విటమిన్ సీ బాడీ లోంచీ వెళ్లిపోతుంది. దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే జామకాయలు తినేయాలి.

జామకాయ నిండా పోషకాలే. పైగా ఫైబర్ కూడా ఉంటుంది. తింటే మంచి ఆహారం తిన్నట్టే. జామ ఆకులు కూడా అంతే. చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. బయటి కాలుష్యం వల్ల మన చర్మం పాడైపోతుంది. అడ్డమైన మచ్చలు, కణతులు, ఏవేవో వస్తుంటాయి చాలా మందికి. వాళ్లు జామకాయలు తింటూ… జామ ఆకుల రసం తాగేస్తూ ఉంటే… ఆటోమేటిక్‌గా స్కిన్ నయమవుతుంది. చర్మం ముడతలు పడకుండా జామకాయ కాపాడుతుంది.

health benefits with guava leaves: జామ ఆకులతో 8 ఆరోగ్య ప్రయోజనాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this