- విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో నిషేధం
Ban Gutka Tobacco: నిషేధిత గుట్కా అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గుట్కా బారిన విద్యార్థులు పడకుండా ఉండేదుకు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ స్కూళ్లకు 200 మీటర్ల సమీపంలో గుట్కా, పాన్, మద్యం అమ్మకాలు నిర్వహి ంచరాదని ఆదేశాలు జారీచేసింది. దీంతోపాటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల చుట్టూ కలుషిత వాతావరణం లేకుండా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలకు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ల సమీపంలోని పరిస్థితులను ఇకపై ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తూ ఉంటారని ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో ఏఎన్ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. తాజా ఆదేశాల ప్రకారం ఏఎన్ఎం క్రమం తప్పకుండా వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి స్కూలు సమీపంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. దీని కోసం ఒక ప్రత్యేక యాప్ను కూడా ప్రభుత్వం రూపొందించనుంది. ఈ యాప్ ద్వారా అక్కడి ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తుండాలి. స్కూళ్లకు సమీపంలో ఎవరైనా సిగరెట్, గుట్కా, పాన్షాపులు నిర్వహిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. పాఠశాలల సమీపంలో ఎవరైనా పొగతాగితే అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. పాఠశాలల పరిసర ప్రాంతాల్లో మద్యం షాపులు కనిపించినా, ఎవరైనా మద్యం సేవించిన వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేశారు. ఇందుకోసం ప్రతి స్కూల్నూ పర్యవేక్షణ కోసం మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అనంతరం వీటిని ఆన్లైన్ పోర్టల్కు అనుసంధానిస్తారు.