Bank EMI: కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరుస్తున్న క్రమంలో దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించాయి.
దీంతో చాలా మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. లోన్ ఈఎంఐ కట్టలేక సతమతమౌతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీపికబురు అందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
లాక్ డౌన్ సమయంలో చాలామంది ఉపాధికి దూరమయ్యారు. దీంతో కనీసం నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. అయితే లోన్ తీసుకున్న వారికి నెలవారీగా ఈఎంఐ కాట్టాల్సి ఉంటుంది
ప్రస్తుత సమయంలో ఈఎంఐ కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నవారికి ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఓ ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది.
దీని ద్వారా ఎంతో కొంత ఊరట లభించనుంది. అదేంటంటే లోన్ రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ. లోన్ ఈఎంఐ కట్టలేని వారు బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి వారి లోన్ రీస్ట్రక్చర్ గురించి మాట్లాడొచ్చు.
కోవిడ్ 19 సెకండ్ వేవ్ కారణంగా రిజర్వు బ్యాంక్ ఇప్పటిలో లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి ప్రకటించింది. రూ.25 కోట్ల వరకు రుణాలను రీస్ట్రక్చర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
దీంతో సాధారణ ప్రజలు, వ్యాపారులకు, ఎంఎస్ఎంఈలకు ఊరట కలుగనుంది.
రుణ గ్రహీతలు బ్యాంక్‌తో మాట్లాడి వారి రుణాలను రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు.
ఎస్‌బీఐ మాత్రమే కాకుండా ఇతర బ్యాంకుల కస్టమర్లు వారి బ్యాంక్‌కు వెళ్లి ఈ బెనిఫిట్ పొందొచ్చు.
లోన్ రీస్ట్రక్చరింగ్ పొందాలని భావించే వారు సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా కస్టమర్లకు ఎంతో కొంత ఉపయోగం కలగనుంది.