Delta Variant: కోవిడ్ డెల్టా వేరియంట్ యూకేలో ఆందోళన కల్గిస్తోంది. ఇండియాలో తొలిసారిగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్ బ్రిటన్‌లో వేగంగా సంక్రమిస్తుండటమే దీనికి కారణం.
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్‌కు(Corona Second Wave) కారణమైన వేరియంట్ బి. 1.617.2 గా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ ఇప్పుడు యూకేలో ఆందోళన కల్గిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలో 5 వేల 472 మంది ఈ వేరియంట్ బారిన పడ్డారు. మొత్తం ఇప్పటి వరకూ 12 వేల 431 మంది ఈ వేరియంట్‌కు గురయ్యారు. ఇప్పటికే 271 మంది ఆసుపత్రుల్లో చేరారు. అసలు విశేషమేమంటే ఇందులో చాలామంది వ్యాక్సిన్ వేయించుకున్నవారే. బోల్టన్, బ్లాక్‌బర్న్ ప్రాంతంలో అత్యధిక కేసులు వెలుగు చూశాయి. డెల్టా వేరియంట్ ఎక్కవగా ఫైజర్ వ్యాక్సిన్ (Pfizer vaccine) తీసుకున్నవారిలోనే గుర్తించారు. డెల్టా వేరియంట్ వైరస్‌ను(Delta Variant)ఎదుర్కొనే యాంటీబాడీలు చాలా తక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నట్టు గుర్తించారు. రెండు డోసుల మధ్య సమయాన్ని తగ్గించాలనే వాదనకు, బూస్టర్ డోస్ వ్యాక్సిన్ (Vaccine)అవసరానికి బలం చేకూరుతుంది.