Online Classes: కరోనా సెకండ్ వేవ్ కారణంగా స్కూల్స్ ఏప్రిల్ 20 నుండి మూతబడ్డాయి. విద్యార్థుల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీనితో విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు మరుగున పడిపోతున్నాయి. దీనిని నివారించేందుకు రాష్ట్ర విద్యాశాఖ పూనుకుంది.
నేటి నుండి రాష్ట్రంలోని 1వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఎస్.సి.అర్.టి డైరెక్టర్ ప్రతాపరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం విద్యార్థులకు నేటి నుండి వివిధ ఆన్లైన్ పద్ధతుల్లో క్లాసులు నిర్వహించనున్నారు. ఆకాశవాణి, ఆన్లైన్ రేడియో, యూట్యూబ్, దూరదర్శన్, వాట్సప్, వర్చువల్ క్లాసులు, వెబెక్స్ మొదలగు అనేక పద్ధతులు ఉపయోగించుకోవాలని క్లాసులు నిర్వహిస్తారు.
ఆన్లైన్ పద్దతుల్లో అభ్యసించడానికి వీలులేని పిల్లలకు ఆఫ్లైన్ పద్ధతి లో బోధన అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తో తమ పిల్లల చదువులు చక్కబడతాయని విద్యార్థుల తల్లి దండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేసి ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకొండి
Clickable Lessons File: Click Here
newStone Online Radio Classes : Click Here
అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది….
గౌరవ సంచాలకులు, రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ వారి ఆదేశాల మేరకు 15-6-21 నుండి విద్యార్థులకు వివిధ మాధ్యమాల (యూ టూబ్ / వాట్సాప్ / రేడియో / దూరదర్శన్ …. ) ద్వారా తరగతులు నిర్వహించ వలెను.
ఇందుకు సంబంధించి తరగతి వారిగా యూట్యూబ్ ఛానెల్స్….
10వ తరగతి విద్యార్థుల కొరకు:
https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7nl5ZL6L1BG-Lew4Zs_-h4K
8వ & 9వ తరగతి విద్యార్థుల కొరకు:
https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7nIN_obLW69OJhmTC7wDbmM
6వ & 7వ తరగతి విద్యార్థుల కొరకు:
https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7nNrfX6eDWpG8XQrubIf88D
3,4 & 5వ తరగతి విద్యార్థుల కొరకు:
https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7m3tj_3iCYJIlQo9qDrIYY-
1వ & 2వ తరగతి విద్యార్థుల కొరకు:
https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7mOe6Hikr9G_UGumpKZrv01