- నేడు మంత్రివర్గ సమావేశం
- పి.ఆర్.సి పై చర్చించే అవకాశం
- శీతాకాల శాసనసభ సమావేశాలపై నిర్ణయం
- నూతనంగా సిక్కు, జైన్ కార్పొరేషన్లు
- కీలక అంశాలపై చర్చ, ఆమోదం
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక అంశాలపై ఫోకస్ పెట్టింది.. ఏపీ మంత్రి మండలి సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో ప్రధానంగా ఆన్లైన్లో సినిమా టికెట్లు అమ్మకాలకు వీలు కల్పిం చేలా ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసే అర్డినెన్సుకు అమోదం తెలపనుంది. వచ్చే నెలలో అసెంబ్లీ శీతాకాల సమా వేశాలు నిర్వహించాలని ప్రభుత్వంభావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియా మకంపై కూడా కేబినెట్ చర్చించనుంది.. ప్రత్యేక ఆహ్వానితుల కోసం చట్ట సవరణ కు ఆమోదం తెలిపే అవకాశం ఉండగా.. దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చట్టసవరణ చేసే అంశంపై దృష్టిసారించనుంది… దేవా దాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుపై మంత్రులతో చర్చించ నున్నారు. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఓ శాఖ ఏర్పాటు చేసే విషయమై చర్చించనున్నారు. నూతనంగా సిక్కు, జైన్ కార్పొరేషన్ ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శాఖలలో ఖాళీల భర్తీకి సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అదే విధంగా కోవిడ్ టీకాలు, థర్డ్ వేవ్ కు తీసుకోవాల్సిన చర్య లపై కూడా సమావేశంలో చర్చకు రానుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల విషయమై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్యోగుల పీఆర్ సీ పై కూడా చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో సుమారు 30 అంశాలతో కూడిన అజెండా పై కేబినెట్ చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.