CBSE Board Exams: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తన బోర్డ్ పరీక్షలను నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 వరకు 10వ తరగతి, 12వ తరగతి బోర్డు టర్మ్ పరీక్షలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకు కొనసాగుతాయిన సీబీఐఈ వెల్లడించింది. అయితే అక్టోబర్ 19న సీబీఎస్‌ఈ పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీ షీట్‌లను విడుదల చేసింది. కరోనా మహమ్మారి కారణంగా మొదటిసారి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షను రెండు దశల్లో నిర్వహించనుంది. సీబీఎస్‌ఈ టర్మ్-1 పరీక్ష ఆబ్జెక్టివ్‌గా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను విద్యార్థులు వారి నివాస ప్రాంతాన్ని బట్టి వారి సౌలభ్యం కోసం పరీక్షా కేంద్రాన్ని మార్చుకొనే వెసులుబాటు ఇచ్చింది. చాలా కాలంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పలువురు విద్యార్థులు తమ ప్రదేశాన్ని మార్చుకొన్నారు. ఈ నేపథ్యంలో వారి సమస్యను దృష్టిలో పెట్టుకొని సీబీఎస్‌ఈ (CBSE) విద్యార్థులకు పరీక్షా కేంద్రాన్ని మార్చుకొనే అవకాశం ఇచ్చింది.
10 వ తరగతి టర్మ్ -1 పరీక్షలు నవంబర్ 30..
ఈ నేపథ్యంలో పదో తరగతి టర్మ్-1 పరీక్షలు నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 11న ముగుస్తాయి. ఇక 12 వ తరగతి పరీక్షలు డిసెంబర్ 1 న ప్రారంభమై డిసెంబర్ 22న ముగుస్తాయి. రెండవ టర్మ్ పరీక్ష మార్చి-ఏప్రిల్ 2022 లో నిర్వహించబడుతుంది. ఇది ఆబ్జెక్టివ్ లేదా సబ్జెక్టివ్ విధానం అనేది దేశంలోని కోవిడ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్- cbse.gov.in లో డేట్ షీట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సీబీఎస్‌ఈ టర్మ్ 1 బోర్డు పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది. శీతాకాలం దృష్ట్యా పరీక్షలు ఉదయం 10.30 గంటలకు బదులు 11.30 గంటలకు ప్రారంభం అవుతుంది. టర్మ్ 2 పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. సీబీఎస్‌ఈ 12వ తరగతిలో 114 సబ్జెక్టులు ఉన్నాయి. 10వ తరగతిలో 75 సబ్జెక్టులున్నాయి. బోర్డు మొత్తం 189 సబ్జెక్టుల పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈలో మొత్తం సబ్జెక్టుల పరీక్ష నిర్వహిస్తే, పరీక్షల మొత్తం వ్యవధి కనీసం 40-45 రోజులు ఉంటుంది. అన్ని సబ్జెక్టుల పరీక్ష నిర్వహిస్తే పరీక్షల మొత్తం వ్యవధి కనీసం 40-45 రోజులు ఉంటుంది. అందువల్ల విద్యార్థుల అభ్యాన నష్టాన్ని నివారించడానికి సీబీఎస్‌ఈ అందించే సబ్జెక్టులను రెండు విభాగాలుగా విభజించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది.