No Results in Joint Staff Council Meeting: ఎటూ తేల్చని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్
అక్టోబర్ 29 – పిఆర్సి నివేదికకు సంబంధించి ఒక పేజీ అధికారిక పత్రం బయటకు రావడం తప్ప శుక్రవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పెద్దగా ముందడుగు పడలేదు. వేతన సవరణ కమిషన్ 27శాతం ఫిట్మెంట్ సిఫార్స్ చేసినట్లు అందులో వివరాలు ఉన్నాయి.ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం లో శుక్రవారం నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులకు ఏ విషయంలోనూ స్పష్టమైన హామీ లభించ లేదని కొన్ని ఉద్యోగ సంఘాలు కలిగించాయి.ఎజెండా అంశాలపై చర్చ జరిగినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇతమిత్థంగా ఏది తేల్చి చెప్ప లేదని పేర్కొంటున్నారు. ఒరేయ్ బాబు పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలన్నీ గట్టిగా పట్టుబట్టాయి. సమావేశం అయ్యే లోపు నివేదిక బయటపెట్టాలని కోరాయి. మూడు రోజుల్లో నివేదిక ఇస్తామని ఒకసారి, వారం రోజుల్లో నివేదిక ఇస్తామని ఒకసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పినా నివేదిక విడుదల విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వలేదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. పీఆర్సీ సిఫార్సుల సంబంధించి ఒక పేజీలో ప్రభుత్వం వివరాలు అందించిందని, 27శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేసినట్లు అందులో ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. వారం రోజుల్లో పీఆర్సీ నివేదిక బయటపెడతామని సీఎస్ హామీ ఇచ్చినట్లు గవర్నమెంట్ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామ్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఎన్జీవో సంఘ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు, ఏపీ అమరావతి జేఏసీ నేతలు ఈ సమావేశం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.