కృష్ణా జిల్లా కలెక్టరేట్లో గన్ మిస్ ఫైర్ అయిన సంఘటన కలకలం రేపింది. ట్రెజరీ గార్డులో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ హెడ్ కానిస్టేబుల్ చేతుల్లోనే తుపాకీ పేలింది.
- హెడ్‌కానిస్టేబుల్ గుండెల్లోకి దూసుకెళ్లిన బ్లులెట్
- డ్యూటీలో ఉన్న సమయంలోనే ప్రమాదం
- సీరియస్ అయిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్
కృష్ణా జిల్లా కలెక్టరేట్లో గన్ మిస్ ఫైర్ అయిన సంఘటన కలకలం రేపింది. ట్రెజరీ గార్డులో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ హెడ్ కానిస్టేబుల్ చేతుల్లోనే తుపాకీ పేలింది. అయితే బుల్లెట్ నేరుగా గుండెల్లోకి దూసుకెళ్లడంతో హెడ్ కానిస్టేబుల్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
హెడ్ కానిస్టేబుల్ ఈ.శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కలెక్టరేట్లోని ట్రెజరీ గార్డులో విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీలో ఉన్న సమయంలోనే ఈ రోజు ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ శ్రీనివాసరావు గుండెల్లోకి దూసుకెళ్లింది. గమనించిన పోలీసులు గాయాలపాలైన శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే.. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై సీరియస్ అయిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఘటనకు సంబంధించిన వివరాలు వెంటనే తెలియజేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.