Molathadu : పూర్వ కాలం నుంచి హిందువులు మొలతాడును కట్టుకోవడం ఆచారంగా వస్తోంది. ఇప్పుడు చాలా మంది మొలతాడును ధరించడం లేదు. కానీ మొలతాడు వల్ల పలు లాభాలు కలుగుతాయని, దాన్ని తప్పనిసరిగా ధరించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే మొలతాడును ధరించడం వల్ల అటు ఆధ్యాత్మిక పరంగా, ఇటు సైన్స్ పరంగా.. ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మొలతాడు రూపంలో సహజంగానే చాలా మంది నల్లనిదారాన్ని కట్టుకుంటారు. దీని వల్ల దుష్టశక్తుల ప్రభావం మనపై ఉండదు. అలాగే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా దిష్టి తగలకుండా ఉంటుంది.
2. ఇప్పుడంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కనుక ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే హాస్పిటల్ కు వెళ్లగలుగుతున్నాం. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. మన చుట్టూ పరిసరాల్లో లభించే ఆకులను, వేర్లను ఉపయోగించి వైద్యం చేసుకునేవారు. ఈ క్రమంలోనే పాము, తేలు వంటివి కుట్టినప్పుడు వెంటనే మొలతాడును తీసి గట్టిగా బిగించి కట్టి విషం తీసేవారు. అందుకనే మొలతాడు కట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు.
3. మొలతాడును ధరించడం వల్ల బరువును అదుపులో ఉంటుందని, జీర్ణక్రియ మెరుగు పడుతుందని చెబుతుంటారు.
4. కొందరికి బానపొట్ట ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే మొలతాడు ధరించాలని సూచిస్తుంటారు.
5. మొలతాడు ధరించడం వల్ల హెర్నియా రాకుండా అడ్డుకోవచ్చు. వెన్నెముకకు సపోర్ట్ లభిస్తుఏంది. వెన్ను సమస్యలు ఉన్నవారు మొలతాడును ధరించాలని చెబుతుంటారు.
6. మొలతాడును ధరించడం వల్ల జననావయవాలు ఆరోగ్యంగా ఉంటాయట. అందుకనే కొన్ని ప్రాంతాల్లో పురుషులే కాదు, స్త్రీలు కూడా మొలతాడును ధరిస్తుంటారు.
7. పూర్వం పురుషులు బెల్ట్‌లను ధరించేవారు కాదు. అందువల్ల కింద ధరించే వస్త్రాలు జారిపోతాయేమోనని మొలతాడును ధరించి మీదకు వేసుకునేవారు. అలా మొలతాడును కొందరు ధరిస్తున్నారు.
8. పూర్వకాలంలో మొలతాడుకు ఒక తాయత్తును కట్టేవారు. అందులో వారికి చెందిన బొడ్డు తాడు మూలకణాలు ఉంటాయి. పుట్టినప్పుడు మంత్రసానులు ఆ బొడ్డుతాడును తీసి అవి ఎప్పటికీ పాడవకుండా ఉండేందుకు వాటికి ఏవో పసరు మందులు రాసి తాయత్తులో పెట్టి కట్టేవారు. దీంతో ఆ వ్యక్తికి భవిష్యత్తులో లివర్ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చినప్పుడు ఆ మూలకణాలను తీసి చికిత్స చేసేవారు. ఇప్పుడు స్టెమ్ సెల్స్ థెరపీలాగేనన్నమాట. అందుకనే అప్పట్లో ఆ తాయత్తు కోసం కూడా మొలతాడును కట్టుకునేవారు.
9. ఒక కొందరికి జాతక రీత్యా దోషాలు ఉంటాయి. వాటిని పోగొట్టుకునేందుకు వివిధ రకాల యంత్రాలు, తాయత్తులను ధరిస్తుంటారు. కొన్నింటిని నడుముకు ధరించాల్సి ఉంటుంది. అందుకు మొలతాడు ఉపయోగపడుతుంది. కనుకనే పూర్వకాలం నుంచి మొలతాడును ధరించడం ఆచారంగా వస్తోంది.