Car Launches | ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రస్తుతం మంచి డిమాండ్ స్టేజ్‌లో ఉంది. మన దేశంలో 2022 తొలి రెండు త్రైమాసికాలలో ఎలక్ట్రిక్ కార్లు, SUVలు, కాంపాక్ట్ SUVలు, ప్రీమియం వేరియంట్లు రిలీజ్ కానున్నాయి.
Car Launches: నెక్సాన్ ఈవీ నుంచి లేటెస్ట్ ఎర్టిగా వరకు.. ఈ ఏడాది లాంచ్ కానున్న టాప్ కార్స్ ఇవే..
ఇండియన్ ఆటోమొబైల్ (Auto Mobile)ఇండస్ట్రీ ప్రస్తుతం మంచి డిమాండ్ స్టేజ్‌లో ఉంది. మన దేశంలో 2022 తొలి రెండు త్రైమాసికాలలో ఎలక్ట్రిక్ కార్లు, SUVలు, కాంపాక్ట్ SUVలు, ప్రీమియం వేరియంట్లు రిలీజ్ కానున్నాయి. రానున్న రోజుల్లో అప్‌డేటెడ్ మోడళ్లను విడుదల చేయడంపై వాహన తయారీ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మారుతీ, టాటా, ఫోక్స్‌వ్యాగన్, BMW బ్రాండ్ల నుంచి రానున్న టాప్ కార్లు, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం.
వోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus)
2022లో వోక్స్‌వ్యాగన్ వెంటో ప్లేస్‌లో వర్టస్ మోడల్‌ను లాంచ్ చేయనుంది. దీని ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. మోడళ్ల వారీగా ధరలు మేలో వెల్లడి కానున్నాయి. ఈ కారులో 1-లీటర్ TSI, 1.5-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. డైనమిక్ లైన్, పెర్ఫార్మెన్స్ లైన్ (GT) ట్రిమ్‌లలో రానుంది. జీటీ ట్రిమ్ 150PS ఇంజిన్‌తో మాత్రమే రానుంది. ఇది 7-స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్‌తో జత చేసి ఉంటుంది. 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం.
మారుతీ ఎర్టిగా, XL 6 (Maruti Ertiga, XL 6)
మారుతి XL6, ఎర్టిగా రెండింటికి చిన్నపాటి కాస్మెటిక్ ట్వీక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ప్యాడిల్ షిఫ్టర్ వంటి అప్‌డేటెడ్ ఫీచర్లతో రిఫ్రెష్ మోడల్స్ అందించనుంది. XL6 వేరియంట్ 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కొత్త MIDతో వస్తుందని భావిస్తున్నారు. సరికొత్త ఎర్టిగా ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన కొత్త 6-స్పీడ్ ATతో అప్‌డేటెడ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.
Tata Nexon EV అప్‌డేట్
టాటా Nexon EV రెండవ, పెద్ద బ్యాటరీ ఆప్షన్‌తో రానుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది 40-kWh బ్యాటరీ ప్యాక్‌తో రావచ్చు. దీన్ని కంపెనీ లాంగ్ రేంజ్ వెర్షన్‌గా విక్రయించనుంది. అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ESC, అడ్జస్టబుల్ రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి అదనపు ఫీచర్లతో రావచ్చు. కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు కూడా ఉండవచ్చు.
జీప్ మెరిడియన్ (Jeep Meridian)
జీప్ మెరిడియన్ కంపాస్ SUV 3 వరుసల వెర్షన్. ఇది పొడవైన వీల్‌బేస్‌తో వస్తుంది. వెడల్పుగా, పొడవుగా ఉంటుంది. కంపాస్ నుంచి విభిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. జీప్ మెరిడియన్ 6-స్పీడ్ మాన్యువల్, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రానుంది. FWD, AWD కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉండనుంది.
Mercedes-Benz C-క్లాస్
ఆరవ-తరం Mercedes-Benz C-క్లాస్ మే 2022 తర్వాత ఇండియన్ షోరూమ్‌లకు రావచ్చు. ఇది జర్మన్ కాంపాక్ట్ లగ్జరీ సెడాన్ మాదిరిగా పెద్దదిగా ఉంటుంది. తాజా S-క్లాస్ క్యాబిన్, వెర్టికల్లీ ఓరియెంటెడ్ సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 11.9-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో దీన్ని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో.. పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లతో ఈ వేరియంట్ రానుంది.