Cow Ghee on Hair: ఆవు నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆవు నెయ్యి నిత్యం తీసుకోవడం వల్ల ఆహారపు రుచిని పెంపొందించడంతోపాటు శరీరానికి పోషకాలు అందుతాయి.
Hair Care Tips: ఆవు నెయ్యితో చుండ్రుకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా.
చుండ్రుకు చెక్ పెట్టండి: జుట్టుకు ఆవు నెయ్యి ఉపయోగించడం ద్వారా చుండ్రుకు చికిత్స చేయవచ్చు. నెయ్యి మలాసెజియా ఫర్ఫర్ అనే ఫంగస్ వృద్ధిని అడ్డుకుంటుంది. మలాసెజియా ఫర్ఫర్ ఫంగస్ చుండ్రు.. ప్రధాన కారణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నెయ్యిలో బ్యాక్టీరియా, ఫంగస్‌తో పోరాడే గుణాలు ఉన్నాయి. చుండ్రు నుంచి ఆవు నెయ్యి రక్షిస్తుంది.
జుట్టును మృదువుగా మార్చుతుంది: నెయ్యిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా.. ఆరోగ్యంగా మారుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే నెయ్యి జుట్టుకు పోషణను అందించడంతో పాటు జుట్టులో తేమను రక్షిస్తుంది.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది: జుట్టులో పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం మొదలవుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి నెయ్యి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నెయ్యిలో ఉండే పోషకాలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
గ్రే హెయిర్‌ను నియంత్రిస్తుంది: సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల జుట్టు మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. సమయం కంటే ముందే జుట్టు తెల్లబడటం ఈ మధ్య సహజంగా మారుతుంది. పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. మీరు నెరిసిన జుట్టుతో ఇబ్బంది పడుతుంటే.. నెయ్యి జుట్టుకు రక్షణగా నిలుస్తుంది. నెయ్యి రాసుకోవడం వల్ల వెంట్రుకల వేర్లు దృఢంగా మారడంతోపాటు జుట్టు నెరిసిపోవడం ఆగిపోతుంది.
జుట్టు పొడిబారడాన్ని తొలగిస్తుంది: నెయ్యిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడం తొలగిపోయి. జుట్టును సులభంగా విడదీస్తుంది. నెయ్యి జుట్టులోని తేమను లాక్ చేస్తుంది. జుట్టు పొడిని తొలగిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)