KGF Chapter First Week Collections : భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా 7 వ రోజు 2.34 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
KGF Chapter First Week Collections : హిందీలో కెజియఫ్‌ను మించింది లేదు.. బాహుబలి 2 రికార్డ్ బద్దలు
KGF Chapter 2 | Yash : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టమీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ సినిమా. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ (Yash).. ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2)మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా 7 వ రోజు 2.34 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. రెండు రాష్ట్రాల్లో 78 కోట్ల బిజినెస్ చేయగా.. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 79 కోట్లు అందుకోవాల్సి ఉండగా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 14.49 కోట్ల షేర్‌ను అందుకోవాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఈ చిత్రం యుఎస్‌లో 3 మిలియన్ల మార్క్‌ను దాటింది. ఈ సినిమా సౌత్ వెర్షన్ల నుంచి ఈ కలెక్షన్లు బాగా వచ్చాయని అంటున్నారు. కెజియఫ్ 2 మొదటి వారం పూర్తి అయ్యేసరికి హిందీలో RRR కలెక్షన్‌లను క్రాస్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం 250 కోట్ల మార్కును అందుకుందని తెలుస్తోంది. అంతేకాదు 250 కోట్ల టార్గెట్‌ను అత్యంత ఫాస్ట్’గా అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బిజినెస్ 345 కోట్ల రేంజ్ అవ్వగా.. మొదటి వారంలోనే బ్రేక్ చేసింది. అంతేకాదు 10 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.
కెజియఫ్ మొదటి వారం షేర్ కలెక్షన్స్…
- Karnataka- 66.20Cr
- Telugu States – 64.51Cr
- Tamilnadu – 23.15Cr
- Kerala – 18.10Cr
- Hindi+ROI – 128.60CR~
- Overseas – 56.45Cr
- Total WW collection – 357.01CR
మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్…
- Karnataka- 115.30Cr
- Telugu States – 102.60Cr
- Tamilnadu – 45.60Cr
- Kerala – 41.15Cr
- Hindi+ROI – 300.60CR~
- Overseas – 114.05Cr
- Total WW collection – 719.30CR Approx
ఇక అది అలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెజియఫ్ సిరీస్‌లో ఇప్పటికే రెండు సినిమాలు రాగా.. మరో సినిమా కూడా రాబోతుందని టాక్. తాజాగా విడుదలైన కెజియఫ్-2 క్లెమాక్స్‌లో పార్ట్-3 (KGF Chapter 3) ఉండబోతుందని హింట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. మూడో భాగంలో రాఖీ భాయ్ ఇంటర్నేషనల్ లెవల్‌లో పవర్ చూపించనున్నాడట. పార్ట్ 3లో (KGF Chapter 3) రాఖీ భాయ్ సామ్రాజ్యం అమెరికాలోనూ విస్తరించనుందని టాక్. ఇక ఈ చిత్రం 10 వేలకు పైగా స్క్రీన్‌లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా నార్త్‌లో 4,400 కి పైగా, సౌత్‌లో 2,600 కి పైగా, ఓవర్సీస్ లో హిందీ భాషలో 1,100 కి పైగా, మిగతా సౌత్ బాషల్లో 2,900కి పైగా స్క్రీన్ లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించారు. ఇక కెజియఫ్ మొదటి భాగం కలెక్షన్స్ విషయానికి వస్తే.. అన్ని ఇండస్ట్రీలో విజయ బావుటా ఎగరవేసింది ఈ సినిమా. తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కెజియఫ్ రూ. 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.
KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు నటించారు. KGF 2లో ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో హిందీ బడా హీరో సంజయ్ దత్‌తో (Sanjay Dutt) అథీరా పాత్ర కోసం తీసుకున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి పాత్రలో (Raveena Tandon) రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేశారు. కన్నడ నటి శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగండూర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.