APGLI issue of New Policies as per PRC 2022 Slabs G.O 198, Rules Comprehensive Guidelines APGLI Memo No. 3 dated. 25.10.2022
మెమో నెం. 03/సాధారణ-1 /2005-06/2009-10/2015-16/2022-23 తేది: 25/10/2022
విషయము: బీమా -2022 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారము మూలవేతనం పై 15% వరకు ప్రీమియం తగ్గింపు చేయుచున్న ప్రతిపాదనలు ఆమోదించుట – ఉత్తర్వులు జారీ చేయుట – గురించి.
నిర్దేశము:
1. ప్రభుత్వ ఉత్తర్వులు నెం. (26), ఆర్థిక మరియు ప్రణాళిక (ఆ.వి. పరిపాలన -II) శాఖ, తేదీ: 22-02-1995.
2. ఈ కార్యాలయ మెమో నెం. 12/సాధారణ/1986-87, తేది: 09-05-1995,
3. ఈ కార్యాలయ మెమో నెం. 03/సాధారణ/2005-06. తేది: 16-05-2006.
4. ఈ కార్యాలయ మెమో నెం. 03/సాధారణ/2005-06 /2009-10,da: 05-06-2010.
5. ఈ కార్యాలయ మెమో నెం. 03/సాధారణ/2005-06/2009-10.38: 17-08-2010.
6. మెమో.నెం. 19/జనరల్ /మిస్ లేనియస్/2012-13, తేది: 28-06-2012
7. ఈ కార్యాలయ మెమో నెం. 03/సాధారణ-1/2209373/2015-16, 8: 17-11-2015.
8. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య జి.ఓ.ఎం.ఎస్.199, ఆర్థిక (పరిపాలన) శాఖ, తేది: 30-07-2013.
9. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య జి.ఓ.ఎం.ఎస్.36, ఆర్థిక (DI&IFI) శాఖ, తేది: 05-03-2016.
10. ఈ కార్యాలయ మెమో నెం. 03/సాధారణ/2005-06/2009-10 /2015-16,38:16-03-2016.
11. ఈ కార్యాలయ మెమో నెం. 03/సాధారణ/2005-06/2009-10. /2015-16,38:27-04-2016,
12. ఈ కార్యాలయ మెమో నెం. 03/సాధారణ/2005-06/2009-10./2015-16, 38: 01-09-2017.
13. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య జి.ఓ.ఎం.ఎస్.198, ఆర్థిక (ADMN-III DI, DSA) శాఖ, తేది: 18-10-2022.
*******
1. జిల్లా బీమా అధికారుల దృష్టిని పై విషయమునకు తీసుకొనివస్తూ తెలియ చేయునది ఏమనగా, నిర్దేశము (13) నందలీ ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా బీమాకు అర్థమైన వయస్సును (insurable age) 21 సంవత్సరముల నుండి 57 సంవత్సరముల వరకు నిర్దారిస్తూ రివైజ్డ్ పే స్కేల్స్ 2022 నందు ప్రీమియం నిర్బంద స్లాబ్ రేట్లను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేయుట జరిగినది. అందుకు అనుగుణంగా G.0. నందలి సూచనల ప్రకారం 01-11-2022 నుండి పాలసీలు జారీ చేయవలసినదిగా ఆదేశించడమైనది. నిర్దేశము (1) మరియు (2) నందు ప్రభుత్వ/బీమా నిర్దేశాలయము ఉత్తర్వులననుసరించి ప్రస్తుతం ఉన్న ప్రీమియం గరిష్ట పరిమితి 20% ని నిర్దేశము (13) నందలి ప్రభుత్వ ప్రకారము రద్దు చేయడమైనది, మరియు అన్ని పాలసీలు కలుపుకుని బేసిక్ పే లో గరిష్టంగా 15% వద్ద ప్రీమియం పెంచుకోవడానికి పరిమితి విధించడమైనది. కావున 2022 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారము మూలవేత వరకు నెలసరి ప్రీమియం తగ్గింపు చేయుచూ, ప్రతిపాదనలు సమర్పించినచో అట్టే ప్రతిపాదనలు క్రింద తెలియచేసిన సూచనలకు లోబడి ఆమోదించవలసినదిగా తెలియజేయడమైనది.
2. ఉద్యోగులందరూ సవరించిన రేట్ల ప్రకారం వారి మూల వేతనానికి అనుగుణంగా నెలవారీ కనీస ప్రీమియంను పెంచి, ప్రతిపాదన ఫారమ్ ను వారి DDO ల ద్వారా సంబంధిత APGLI కార్యాలయానికి పంపాలి. 000 గజిటెడ్ కానప్పుడు తదుపరి ఉన్నత గజిటెడ్ అధికారి దృవీకరణ చేయాల్సి ఉంటుంది.
3. స్వయంగా DDO 3 దరఖాస్తుదారు ఐనప్పుడు మరో గజిటెడ్ అధికారి దృవీకరణ చేయాల్సి ఉంటుంది.
4. నెలవారీ చెల్లిస్తున్న ప్రీమియం మేరకు ప్రతిపాదన ఫారమ్లను సమర్పించకపోతే, ఉద్యోగులు పెంచిన ప్రీమియలకు బీమా కవరేజీ వర్తించదు.
5. డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ అధికారులు మొదటి ప్రీమియంను స్లాబ్ రేట్ల ప్రకారం మాత్రమే రికవరీ చేయాలి.
6. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో సహా చందాదారులందరికీ వారి ప్రీమియం జమ ఐన తేదీ నుండి మొదటి పాలసీ జారీ చేయాలి.
7. మొదటి పాలసీ పొందిన అనంతరం పాలసీదారుడు ఒక సంవత్సరం సర్వీస్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్లాబ్ రేటుకు మించి ప్రీమియం పెంచుకోవచ్చు.
8. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎవరైనా ప్లాట్ రేట్ కంటే తక్కువ ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి కానప్పటికీ స్లాబ్ రేట్ వరకు ప్రీమియం పెంచుకోవచ్చు.
9. తేదీ:01-11-2022 కంటే ముందు DCR తో పాలసీ జారీ చేస్తున్న సందర్భంలో RPS 2015 నందలి సమాన మూల వేతనాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య జి.కె.ఎం.ఎస్. 36, ఆర్థిక (DIGIFI) శాఖ, తేది.. 05-03-2016 ప్రకారం (60) సంవత్సరాల మెచ్యూరిటీతో, సంబంధిత Sum Assured table ను అనుసరించి పాలసీ జారీ చేయాలి.
10. మూల వేతనంలో 8% కంటే ఎక్కువ ప్రీమియం పెంచుకున్న ఉద్యోగుల విషయంలో గత మూడు సంవత్సరాలలో వాడుకున్న మెడికల్ లేన్ల వివరాలను DDO గారిచే సర్టిఫికేట్ మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్ లేదా తత్సమాన ప్రభుత్వ వైద్యుని ద్వారా జారీ చేయబడిన గుడ్ హెల్త్ సర్టిఫికెట్ను సమర్పించాలి.
11. 57 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న ఉద్యోగి మొదటి అదనపు పాలసీల కోసం ప్రీమియలను ప్రారంభించవచ్చు/పెంచుకోవచ్చు. అయితే వారికి 57 సంవత్సరాల వయస్సు దాటిపోయే లోపుగా నిర్దేశిత ప్రొఫార్మాలో తన దరఖాస్తును సంబంధిత APGLI కార్యాలయానికి సమర్పించాలి.
12. గతం నుంచి ప్రీమియం మనహాయించబడినప్పటికీ, చందాదారు తన దరఖాస్తును సమర్పించిన తేదీకి (57) సంవత్సరాల వయస్సు దాటినట్లయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపాదన ఫారమ్ అంగీకరించబడదు. అటువంటి మొత్తాలు అనధికార మొత్తాలుగా పరిగణించబడి చందాదారుకి తిరిగి చెల్లించబడతాయి.
13. 57 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఉద్యోగి మొదటి/అదనపు పాలసీల కోసం ప్రేమయం ప్రారంభించకూడదు/పెంచకూడదు. ఇప్పటికి ఉన్న పాలసీలకు సంబంధించి చివరి ప్రీమియం తేదీ వరకు ప్రీమియం రికవరీ కొనసాగించాలి.
14. (a) ప్రతిపాదన సమర్పించే నాటికి 1) గుండె 2) కి 3) ఉచిరితిత్తులు మరియు 4) క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న పాలసీదారులకు ప్లాబ్ రేటుకు లోబడి మాత్రమే పాలసీ జారీ చేయబడుతుంది. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పొందిన పాలసీలు యధావిధిగా అమలులో ఉంటాయిని తెలియజేయడమైనది.
(b) ఒకవేళ మరణము 3 సంవత్సరముల లోపు సంభవిస్తే ప్రీమియం అన్ని పాలసీలు కలుపుకొని క్లాబ్ రేట్ పరిధిలో వుండి Death with in 3 years రిజిస్టర్ లో నమోదు చేసి సాధారణ మరణ క్లెయిమ్ లాగానే పరిష్కరించాలి. ప్రీమియం అన్ని పాలసీలు కలుపుకొని క్లాట్ రేట్ కంటే ఎక్కువగా వున్నపుడు మాత్రమే మెడికల్ లీవు వివరాలు, వివరాలు, Departmental death certificate కోరవలెను.వివరాలు, Departmental death certificate కోరవలెను.
15. అంగవైకల్యము / 100% దృష్టిలోపం ప్రమాదకరమైన వ్యాధి గా పరిగణలోనికి రానందున పాలసీదారుల బేసిక్ పే ప్రకారము పాలసీలు జారీ చేయవలసినదిగా ఆదేశించడమైనది. అంగవైకల్యము మరియు పూర్తి దృష్టి లోపము (100%) గల ఉద్యోగుల ప్రతిపాదకుల నుండి వైద్య కారణాల పై వినియోగించిన సెలవులకు సంబంధించి వివరములు సేకరించి, అట్టి ఉద్యోగుల ప్రతిపాదనలను అమలులో వుషు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే -మూలవేతనము పై 15% వరకు సాధారణ రేటు పై ఆమోదించవలసినదిగా సూచించడమైనది.
16. వైద్య సెలవులు ఎక్కువగా వాడుకొనిననూ, లేక ప్రాణాంతక వ్యాధులతో సెలవు వాడుకొనిననూ, ఆ విధమైన ఫైలు మాత్రమే జిమా నిర్దేశాలయమునకు సూచనల కొరకుపంపవలసినదిగా కోరడమైనది..
17. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య జి.ఓ.ఎం.ఎస్. 198. ఆర్థిక (ADMN-III-DI, DSA) శాఖ, తేది: 18-10 2022 ప్రకారము AIMS నందు మార్పులు జరుగుతున్నవి. తదనంతరం ప్రతిపాదనలపై తగు చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించడమైనది..
18. అన్ని జిల్లా భీమా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన వ్యాపారము ప్రాముఖ్యతను గుర్తించి త్వరితగతిన పాలసీలు జారీ చేసి, శాఖ యొక్క బీమా సేవలను మరింత సంతృప్తికరంగా పాలసీదారులకు అందే విదముగా కృషి చేయవలసినదిగా ఆదేశించడమైనది.
19. మరియు అన్ని జిల్లా బీమా అధికారులకు తెలియచేయునది ఏమనగా చందాదారుల మూలవేతనం పై 15% ప్రీమియం చెల్లించుటకు అవకాశము వున్నట్లు తెలియజేస్తూ, జిల్లాలోని ఉద్యోగ సంఘాల నాయకులకు పైన తెలిపిన వివరములు లేఖల ద్వారా తెలియపరచవలసినదిగా మరియు పత్రికా ప్రకటన ఇవ్వవలసినదిగా ఆదేశించడమైనది.
20. జిల్లా భీమాధికారులు పై సూచనలను తప్పనిసరిగా పాటించవలసినదిగాను మరియు మీ కార్యాలయ సిబ్బందికి తెలియజేయవలసినదిగా ఆదేశిస్తూ, ఈ మెమోను మీ కార్యాలయములో స్వీకరించగనే స్వీకృతి రశీదు పంపవలసినదిగా కోరడమైనది.