డి.యస్.సి. 1998 అభ్యర్ధులలో అర్హత గల అభ్యర్థులు ఎవరైతే మినిమమ్ టైమ్ స్కీలు నందు పనిచేయుటకు వెబ్ సైట్ లో సర్టిఫికేట్ లు, అప్ లోడ్ చేసిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నందు అభ్యర్ధులకు ది 06.10.2022 నుండి 12.10.2022 వరకు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం, ఏలూరు జిల్లా, ఏలూరు నందు ఈ దిగువ తెలియపరిచిన విధముగా వారి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరుగును.
1. 06.10.2022 – వరస సంఖ్య 01 నుండి 100 వరకు
2. 07.10.2022 వరస సంఖ్య 101 నుండి 200 వరకు
3. 10.10.2022 వరస సంఖ్య 201 నుండి 300 వరకు
4. 11.10.2022 వరస సంఖ్య 301 నుండి 400 వరకు
5. 12.10.2022 వరస సంఖ్య 401 నుండి 470 వరకు
మరియు సదరు అభ్యర్ధుల జాబితా deowg.org వెబ్ సైట్ నందు పొందుపరచడమైనది. కావున పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారము డి.యస్.సి. 1998 మినిమమ్ టైమ్ స్కేలు నందు ఉపాద్యాయులగా పనిచేయుటకు వెబ్ సైట్ లో సర్టిఫికేట్ లు, అప్ లోడ్ చేసిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నందలి అభ్యర్థులు సెర్టిఫికెట్లు పరిశీలన కొరకు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం, ఏలూరు జిల్లా, ఏలూరు నందు ఉదయము 10.30 గంటలకు హాజరు కావలసినదిగా తెలియచేయడమైనది. డి.యస్.సి. 1998 మినిమమ్ టైమ్ స్కేలు నందు ఉపాద్యాయులగా పనిచేయుటకు వెబ్ సైట్ లో సర్టిఫికేట్ లు, అప్లోడ్ చేసిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నందలి అభ్యర్థులు ఈ క్రింద తెలియపరచిన విధముగా వారి ఒరిజినల్ మరియుడూప్లికేట్ సర్టిఫికేట్ లు (03 సెట్లు) సెల్ఫ్ అటెస్టెడ్ తో జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం, నందు వారికి కేటాయించిన తేదీలలో హాజరు కావలసినదిగా జిల్లా విద్యశాఖాధికారిని, ఏలూరు జిల్లా శ్రీమతి ఆర్.ఎస్.గంగా భవాని వారు తెలియపరచడమైనది.
1. ఆదర్ కార్డ్ ఒరిజినల్ హాల్ టికెట్/ర్యాంక్ కార్డ్
3.డిఎస్సీ 1998 ఇంటర్వ్యూ లెటర్
4. అకడెమిక్ (ఎస్ఎస్సీ/ఇంటర్/డిగ్రీ/పీజీ) 5. ప్రొఫెషనల్ (డి.ఎడ్/బి.ఎడ్/ఇతరములు),
6.స్టడీ సెర్టిఫికేట్ / రెసిడెన్సీ / ఏజెన్సీ ఏరియా సెర్టిఫికేట్ 7.ఎక్స్పీరియన్స్ సర్టిఫికట్ ఏదైనా,
8. కమ్యూనిటీ సర్టిఫికేట్/పీహెచ్ సెర్టిఫికేట్
9.ఆన్లైన్ రిఫరెన్స్ కాపీ