పత్రికా ప్రకటన
2023 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆన్ లైను లో దరఖాస్తు చేసుకొనుటకు మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ. లో, 15-11-2022 వరకు పొడిగించడమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచూ, తల్లి తండ్రుల సంవత్సరాదాయం 3,50,000/- లోపు ఉన్న విద్యార్థులు అందరూ ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ప్రైవేట్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుచున్న విద్యార్ధులు ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు కాదు. ఈ పరీక్ష కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్ సైటు www.bse.ap.gov.in నందు NMMS ట్యాబ్ లో గల “NMMS Online Application Receiving-2022” అనే లింకును ఓపెన్ చేసి సంబంధిత స్కూల్ U-DISE కోడ్ ను నమోదు చేయవలెను. కుల, ఆదాయ మొదలగు ధృవ పత్రములు లేని విద్యార్థులు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనవచ్చును, గాని 2023 ఫిబ్రవరి మొదటి వారమునకు అన్ని ధృవపత్రములు తప్పనిసరిగా సిద్ధం చేసుకొనవలెను. పరీక్ష రుసుము ఓ.సీ, బీ.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి. యస్.టి విద్యార్థులకు రూ.50/- నామినల్ రోల్ మరియు SBI Collect ఒరిజినల్ రశీదును సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో 19-11-2022 లోపు సమర్పించవలెను. ఈ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్ధులకు 9, 10, 11, 12 తరగతులకు విద్యా మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారి నియమ నిబంధనలను అనుసరించి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు విద్యా మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారి ద్వారా నేరుగా విద్యార్ధి బ్యాంక్ ఖాతాలో జమచేయబడును. ఎంపిక అయిన ప్రతి విద్యార్థి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో ఆధార్ వివరములు నమోదు చేయవలసి ఉన్న కారణమున ఈ సంవత్సరం నుండి విద్యార్థి వివరములు ఆధార్ లో ఉన్న ప్రకారంగా నమోదు చేయవలెను. మరిన్ని వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు గానీ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గానీ సంప్రదించవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు. తెలియజేసారు.