పత్రికా ప్రచురణార్ధం.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారిందని, 11వ పి.ఆర్.సి.లో అనేక ఆర్ధిక ప్రయోజనాలు నష్టపోయినప్పటికినీ ఉద్యోగులు ప్రభుత్వంపై ఏదో రూపాన ఆ వష్టాన్ని భరించకపోతారా అని ఆశతో ఉన్నారని, అయితే ప్రస్తుత పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని, రావలసిన నెల నెలా జీతాలు కూడా ఆలస్యంగా వస్తున్నాయని, ఇక ఉద్యోగులు దాచుకున్న సొమ్ములు జి.పి.ఎఫ్. మరియు ఎ.పి.జి.ఎల్.ఐ. వంటి ఖాతాల నుండి కుటుంబ అవసరాలకు సొమ్మున విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని సైతం ప్రభుత్వం కల్పించడం లేదని, ఇప్పటికి పి.ఆర్.సి. అమలు అనంతరం సుమారు నాలుగు డి.ఎ.లు. పెండింగ్లో ఉన్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని సుమారు పది మండి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు వివిధ రూపాలలో ప్రభుత్వం బకాయిపడిందని వాటిని కూడా ప్రభుత్వం చెల్లించేందుకు ముందుకు రావడం లేదని ఎ.పి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు ఆరోపించారు.
ఇక ప్రభుత్వ పెద్దలతోమా, ఆర్ధికశాఖ అధికారులతోమా, మంత్రివర్గ ఉపసంఘంతోనూ చర్చించి ప్రయోజనం లేదని, కేవలం హామీలకే పరిమితం అవుతున్న సమావేశాలు నిష్ప్రయోజనమని భావించామని, కాబట్టే ఏప్రిల్ నెల నుండి తమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మరియు పెండింగ్ బకాయిలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఈ నెల ది.09-01-2023వ తేదీన జరిగిన తమ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించామని, ఎ.పి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కె.ఆర్. సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీ జి. ఆస్కారరావు మీడియా ప్రతినిధులకు తెలిపారు.
అయితే అంతకు ముందు తమ ప్రయత్నాలలో భాగంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 309 అధికరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల నియంత్రణ విషయంలో ప్రత్యక్ష సంబంధ అధికారాలు గల రాష్ట్ర గవర్నరు శ్రీ బిశ్వభూషణ్ హరిచందనము ది.19-01-2023వ తేదీన ఉదయం గం.11.30ని||లకు రాజభవన్లో తమ సంఘ ప్రతినిధులతో కలిసి ఒక సమగ్రమైన మెమరాండమన్ను తక్షణమే ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాల బకాయిల విడుదలకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుచూ సమర్పించినట్లు సూర్యనారాయణ తెలిపారు.
వీరు ఇరువురూ మాట్లాడుతూ తాము ఉద్యమ నివారణకు అనేక చర్యలు చేపట్టినప్పటికినీ, అంటే వివిధ రూపాలలో ప్రభుత్వంతోనూ, ప్రభుత్వ పెద్దలతోమా, ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ, మంత్రివర్గ ఉపసంఘంతోనూ చర్చలు జరిపి అనేక వినతిపత్రాలు ఇచ్చినము వారు పెడచెవిన పెట్టడంతో ఏప్రిల్ నెలలో తమ సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నివదించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను, ఆర్థిక పరమైన ఇబ్బందులను గుర్తెరిగి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ మరియు రెగ్యులర్ ఉద్యోగుల జీతభత్యాలను ప్రతీ నెలా 1వ తేదీనే చెల్లించేలా ఒక చట్టం చేయాలని, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ఫైనాన్షియల్ కోడ్ లోని 72వ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఖజావాలో మొదటి హక్కుదారుగా ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, ఇతర క్లైయిమ్స్న చేర్చాలని తమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నరును కలిసి విన్నవించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమయొక్క మరియు పదవీ విరమణ పొందిన ఉద్యోగుల యొక్క ఆర్థిక ప్రయోజనాలను బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో తమ సంఘం ఆందోళనకు సిద్ధమని ఆ సంఘ ప్రతినిధులు తెలిపారు. గవర్నరును కలిసిన వారిలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి సుగుణ, భుజంగరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.నాగసాయి, కార్యదర్శులు విజయకుమార్, కిషోర్ కుమార్, వాణిజ్యపన్నుల సర్వీసెస్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి జి.ఎమ్. రమేష్ కుమార్ తదితరులు ఉన్నారు.