School Assembly Daily News and Activities 14.08.2023
School Assembly 14-08-2023
Today News
> Manipur officials told to quit social media groups
> Supreme Court bats for special ‘permanent security units’ to guard court complexes
> Deloitte resigns as statutory auditor of Adani firm weeks after it flagged concerns over report by Hindenburg Research
> India, China to hold 19th Corps Commander talks on August 14
> U.K. has no intention of becoming a place where those seeking to evade justice can hide: British Security Minister Tom Tugendhat
> Yelagiri’s lone hut houses 200 years of a hill tribe’s history
> TELANGANA: BJP leader and five-time MLA resigns, all set to join Congress
> Foxconn gets board nod for $400 million investment in Telangana
> TELANGANA: Group-II exams rescheduled to November 2, 3
> Andhra Pradesh Governor Abdul Nazeer raises issue of UCC and its applicability to joint families
> Teacher unions in Andhra Pradesh demand restoration of Old Pension Scheme, say GPS is unacceptable
> ANDHRA PRADESH: Effective treatment during ‘golden hour’ will help avoid physical disability, loss of life, says official
> NEET UG 2023 Counselling: MCC releases seat matrix for round 2 at mcc.nic.in
> NCERT sets up textbook panel for Classes 3-12; Fields medalist, RSS affiliate founder, Sudha Murthy among members
> India beat West Indies by nine wickets in 4th T20I, level series 2-2
Proverb/ Motivation
Accept the Situation and move on With a Smile….!!
నేటి ఆణిముత్యం
పతిని విడువరాదు పదివేలకైనను
బెట్టి చెప్పరాదు పెద్దకైన
పతిని తిట్టరాదు సతి రూపవతియైన
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము: పదివేలు ఇస్తానన్నా భర్తను విడువరాదు. అంతేకాదు, భర్తపై చాడిలు చెప్పరాదు, భర్తను నిందించరాదు. ఎంత అందగత్తె అయిన భార్య ఐనా ఇవన్ని చేయడం తగదు.
Today’s GK
Q: Which of the state consume highest quantity of fertilizer in India?
A. Tamil Nadu
నేటి జాతీయం
కనుబొమలు ముడిబడ్డాయి
సందేహంగా ఉంది. అనుమానంగా వున్నదని అర్థం: ఎవరికైనా ఏవిషయంలోనైనా సందేహం కలిగితే మనకు తెలియకుండానే కనుబొమలు దగ్గరవుతాయి. ఆ విధంగా పుట్టినది ఈ జాతీయము.
కనుసన్నల మెలగు
విదేయతగా వుండడం: చెప్పిన మాట వినడం: వారితని కను సన్నలలో మెలుగు తుంటారు అని అంటుంటారు. అలాంటి వారిని గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
నేటి సామెత
ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
పెళ్ళి అయిన తర్వాత అప్పటి వరకు అమ్మ చీర కొంగు పట్టుకుని తిరిగే మగ పిల్లలు పెళ్ళాం మోజులో పడి అమ్మని నిర్లక్ష్యం చేస్తారు.ఆలి మాటకి విలువ ఇస్తూ అమ్మ మాటని పెడ చెవిన పెట్టే కొడుకులను ఉద్దేశించి ఈ సామెత వాడతారు. ఆలి తీపి (బెల్లం), అమ్మ ఘాటు (అల్లం) లా అనిపిస్తోంది అని ఈ సామెత అర్ధం.
తెలుసుకుందాము
పరిభ్రమణానికి కారణమేంటి?Cause for moving around?
ఏదైనా వస్తువు, ఉదాహరణకు తిరుగుతున్న బొంగరం, ఒక అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరుగుతుందంటే, అది పరిభ్రమణం చేస్తుందని అంటాం. అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు ఇలా పరిభ్రమణాలు చేస్తుండడానికి కారణాన్ని భౌతిక శాస్త్ర నియమం ‘కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం’ ద్వారా వివరించవచ్చు. ఈ నియమం ప్రకారం పరిభ్రమణం చేస్తున్న వస్తువు ఏ కారణం లేకుండా దానంతట అది ఆగిపోదు. పరిభ్రమణం చేస్తున్న బొంగరం కొంతసేపటికి ఆగిపోవడానికి కారణం దాని ‘ములుకు’కు నేలకు మధ్య ఉన్న ఘర్షణ (friction) ప్రభావమే. ఆ ఘర్షణ లేకుంటే పరిభ్రమణంలో ఉన్న బొంగరం ఆగకుండా అలా తిరుగుతూనే ఉంటుంది.
ఇక నక్షత్రాలు, గ్రహాల పరిభ్రమణ విషయానికి వస్తే, అవి తమ చుట్టూ తాము పరిభ్రమిస్తున్న వాయుధూళి సముదాయం ఘనీభవించడం వల్ల ఏర్పడినవే. ఈ వాయుమేఘాలు గురుత్వ ప్రభావం వల్ల క్రమేపీ తమలోకి తాము కుంచించుకుపోవడంతో కాలక్రమేణా నక్షత్రాలు, వాటి చుట్టూ గ్రహ వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఈ వాయు మేఘాలు కుంచించుకుపోయేకొలదీ వాటి భ్రమణ వేగాలు ఎక్కువయ్యాయి. ఐస్‌పై స్కేటింగ్ చేస్తూ తమ చుట్టూ తాము తిరుగుతున్న స్కేటర్లు తాము దూరంగా బార చాపిన చేతులను తమ శరీరానికి దగ్గరగా తెస్తున్నపుడు వారి పరిభ్రమణ వేగం ఎక్కువవుతున్నట్లు.
ఇలా పరిభ్రమిస్తున్న వాయు మేఘాలు క్రమేపీ నక్షత్రాలుగా మారుతున్నపుడు ఆ మేఘాలలోని అతి కొద్ది శాతం పరిభ్రమణ చలనం మాత్రమే నక్షత్రాలకు బదిలీ అవుతుంది. లేకపోతే ఆ చలన వేగానికి నక్షత్రాలు తునాతునకలై పోతాయి. ఇలా జరగకుండా నిరోధించడానికే ఆ నక్షత్రాల నుంచి గ్రహాలు ఏర్పడి, వాయుమేఘాల తొలి పరిభ్రమణ వేగం అంటే తొలి కోణీయ ద్రవ్యవేగాన్ని తలాకొంచెం పంచుకున్నాయి. అందువల్లే నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి.
Download News Click here