ముఖ్యంగా టెక్నాలజీల్లో ప్రస్తుతం ఏఐ హవా నడుస్తుంది. అయితే మోసగాళ్లు ఏఐను ఉపయోగించుకుని మరీ మోసాలకు తెర తీశారు. ఏఐ వాయిస్ స్కామ్‌లో ఇటీవల కాలంలో చాలా మంది మోసంపోతున్నారు. 59 ఏళ్ల మహిళ ఇటీవల ఏఐ ద్వారా రూపొందించిన వాయిస్ స్కామ్‌కు గురై రూ. 1.4 లక్షలను కోల్పోయింది.
ధనం మూలం ఇదం జగత్ అనే సామెత అందరికీ తెలిసిందే. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వారే రాజు. ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో? దాన్ని దాచుకోవడం కూడా అంతే కష్టంగా మారింది. ముఖ్యంగా టెక్నాలజీల్లో ప్రస్తుతం ఏఐ హవా నడుస్తుంది. అయితే మోసగాళ్లు ఏఐను ఉపయోగించుకుని మరీ మోసాలకు తెర తీశారు. ఏఐ వాయిస్ స్కామ్‌లో ఇటీవల కాలంలో చాలా మంది మోసంపోతున్నారు. 59 ఏళ్ల మహిళ ఇటీవల ఏఐ ద్వారా రూపొందించిన వాయిస్ స్కామ్‌కు గురై రూ. 1.4 లక్షలను కోల్పోయింది. కెనడాలో ఉన్న తన మేనల్లుడిలా మాట్లాడిన ఒక కాలర్ యాక్సిడెంట్ అయ్యిందని డబ్బు వెంటనే కావాలని మోసం చేశాడు. ఈ ఏఐ వాయిస్ స్కామ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఏఐ వాయిస్ మోసాలు ముఖ్యంగా కెనడా, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఎక్కువుగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బంధువుల పేరుతో చేస్తున్న ఈ కాల్స్ ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఏఐ వాయిస్ స్కామ్‌లు ఒకరి స్వరాన్ని అనుకరించడానికి సాంకేతికతను ఉపయోగిస్తాయి. కాల్స్ ద్వారా బాధితులు వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేలా లేదా డబ్బు పంపేలా ప్రజలను మోసగించడమే ఈ స్కామ్ లక్ష్యం. మోసగాళ్లు ప్రజలను ఎలా మోసగిస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం.
కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుల పేర్లతో
స్కామర్ సమస్యలో ఉన్న బంధువుగా నటిస్తూ అత్యవసరంగా డబ్బు కోసం అడుగుతాడు. స్కామ్‌ను మరింత నమ్మదగినదిగా చేయడానికి తెలిసిన పేర్లను ఉపయోగిస్తాడు.
కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు
స్కామర్‌లు తమ వ్యక్తిగత సమాచారం లేదా చెల్లింపుల కోసం అడిగే బ్యాంక్ వంటి బాధితుడు డీల్ చేసే కంపెనీకి చెందినవారని క్లెయిమ్ చేస్తారు.
ప్రభుత్వ అధికారిలా..
స్కామర్‌లు ఐఆర్‌ఎస్ వంటి ఏజెన్సీల ఫోన్ చేసినట్లు బాధితులకు చెబుతారు. బాధితుడు వారిని నమ్మకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తారు.
రక్షణ మార్గాలివే
- ఎవరైనా అత్యవసరంగా డబ్బు లేదా వ్యక్తిగత వివరాలు అడిగితే జాగ్రత్తగా ఉండాలి. అనుమానం ఉంటే ఫోన్ ముగించి, కంపెనీకి నేరుగా కాల్ చేయండి.
- స్కామర్‌లు క్రమం తప్పకుండా తమ పద్ధతులను మార్చుకుంటున్నందున తాజా స్కామ్ వ్యూహాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
- ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే అధికారులకు తెలియజేయాలి